తెలంగాణ ఐఏఎస్‌లకు చీవాట్లు.. డెంగ్యూ కేసులపై ధర్మాసనం సీరియస్..

డెంగ్యూ కేసులపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై నేరుగా సీఎస్,ఉన్నతాధికారులు గురువారం కోర్టుకు హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన విచారణలో.. కోర్టును వారు కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించినా.. న్యాయస్థానం మాత్రం వారి వాదనతో ఏకీభవించలేదు.

news18-telugu
Updated: October 24, 2019, 6:22 PM IST
తెలంగాణ ఐఏఎస్‌లకు చీవాట్లు.. డెంగ్యూ కేసులపై ధర్మాసనం సీరియస్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో నమోదవుతున్న డెంగ్యూ కేసులపై హైకోర్టు సీరియస్ అయింది. ఈ ఏడాది జనవరిలో 85 కేసులు నమోదైతే.. 10 నెలల కాలంలో 3700 కేసులు నమోదయ్యాయని అన్నారు. కేసులు 500శాతం పెరిగినా ప్రభుత్వం వైపు నుంచి చర్యలేవని ప్రశ్నించింది. ఐఏఎస్ అధికారుల యాక్షన్ ప్లాన్ కాగితాలకే పరిమితమైందని.. ఒకసారి మూసీ వద్దకు వెళ్లి చూస్తే వాస్తవ పరిస్థితి అర్థమవుతుందన్నారు. ఐఏఎస్ అధికారుల ట్రైనింగ్‌కి పెట్టే ఖర్చు కూడా డెంగ్యూ నివారణ చర్యలకు పెట్టట్లేదన్నారు. ఇకపై డెంగ్యూ మరణాలు సంభవిస్తే.. ఐఏఎస్ అధికారులు తమ జేబు నుంచి రూ.5లక్షలు చెల్లించేలా ఆదేశాలిస్తామని హెచ్చరించింది. హైదరాబాద్‌లో 10 ఇండ్లకు ఒక చెత్త వాహనాన్ని కేటాయించాల్సి ఉంటే.. అదే వాహనంతో 500 ఇళ్లల్లో చెత్తను సేకరిస్తున్నారని మండిపింది.

ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎక్విప్‌మెంట్‌ను కొనుగోలు చేయాలని ఆదేశించింది. డెంగ్యూ కేసులపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై నేరుగా సీఎస్,ఉన్నతాధికారులు గురువారం కోర్టుకు హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన విచారణలో.. కోర్టును వారు కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించినా.. న్యాయస్థానం మాత్రం వారి వాదనతో ఏకీభవించలేదు. అధికారులు ఇకనైనా ఏసీ రూమ్‌లలో కూర్చొని ప్రణాళికలు రూపకల్పన చేయడం కంటే.. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను గుర్తించాలని సూచించింది.
Published by: Srinivas Mittapalli
First published: October 24, 2019, 6:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading