హోమ్ /వార్తలు /తెలంగాణ /

విపరీతంగా పాజిటివ్ కేసులు.. రేపట్నుంచి పూర్తిగా హైకోర్టు మూసివేత..

విపరీతంగా పాజిటివ్ కేసులు.. రేపట్నుంచి పూర్తిగా హైకోర్టు మూసివేత..

తెలంగాణ హైకోర్టు

తెలంగాణ హైకోర్టు

వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గురువారం నుంచి హైకోర్టు మూతపడనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టును పూర్తిగా శానిటైజేషన్ చేయాలంటూ న్యాయమూర్తులు ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజూకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపరీతంగా నమోదవుతున్నాయి. నిత్యం 1500కు పైగా కేసులు నమోదవుతూ రికార్డులు సృష్టిస్తుంది. పేద, ధనిక.. సామాన్యడు.. ఉద్యోగి అన్న తేడా లేకుండా కరోనా మహమ్మారి అందరినీ కలవరపెడుతోంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కరోనా వైరస్ తాలూకూ భయాందోళనలో నెలకొన్నాయి. తాజాగా తెలంగాణ హైకోర్టును సైతం కరోనా వైరస్ తాకడంతో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి తెలంగాణ హైకోర్టును మూసివేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు తెలంగాణ హైకోర్టులో 25 మంది ఉద్యోగులకు కరోనా వైరస్ పాజిటివ్ సోకినట్టు అధికారులు నిర్ధారించారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గురువారం నుంచి హైకోర్టు మూతపడనుంది.

ఈ నేపథ్యంలో హైకోర్టును పూర్తిగా శానిటైజేషన్ చేయాలంటూ న్యాయమూర్తులు ఆదేశించారు. అందుకు సంబంధించి హైకోర్టులోని ఫైల్స్ అన్నింటినీ జ్యూడీషియల్ అకాడమీకి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కేవలం ప్రధాన కేసులను మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేసే కేసుల విషయంలో ఏలాంటి మార్పులు ఉండబోవని హైకోర్టు పేర్కొంది.

ఇదిలావుంటే.. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 27,612కు చేరుకోగా, 313 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,012 కేసులు యాక్టివ్‌లో ఉండగా, ఇప్పటివరకు 16,287 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.

First published:

Tags: Corona virus, High Court, Telangana

ఉత్తమ కథలు