ఆర్టీసీ సమ్మె.. హైకోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ..

TSRTC Strike : ఆర్టీసీ సమ్మె 45వ రోజుకు చేరుకుంది. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని, తమ డిమాండ్లు పరిష్కరించాలని కార్మికులు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వం దిగి రాకపోవడం, కార్మికులు పట్టు విడవకపోవడంతో సమ్మె దీర్ఘకాల సమమం పాటు కొనసాగుతూనే ఉంది.

news18-telugu
Updated: November 18, 2019, 7:50 AM IST
ఆర్టీసీ సమ్మె.. హైకోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆర్టీసీ సమ్మె 45వ రోజుకు చేరుకుంది. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని, తమ డిమాండ్లు పరిష్కరించాలని కార్మికులు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వం దిగి రాకపోవడం, కార్మికులు పట్టు విడవకపోవడంతో సమ్మె దీర్ఘకాల సమమం పాటు కొనసాగుతూనే ఉంది. ఆర్టీసీ చరిత్రలోనే ఎక్కువ కాలం పాటు సమ్మె చేస్తున్న సందర్భంగా ఇది రికార్డు సాధించింది. అయితే, సమ్మె చట్టవిరుద్ధం అంటూ హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేయడంతో ప్రారంభమైన వాదనలు.. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలు దఫాలుగా వాయిదాలు పడుతూ వచ్చిన ఆర్టీసీ సమ్మెపై నేడు కూడా విచారణ జరగనుంది. ఇరువర్గాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోర్టు సూచించినా ఫలితం లేకపోయింది. దీంతో.. కోర్టే స్వయంగా ముగ్గురు సుప్రీం రిటైర్డ్ జడ్జిలతో కమిటీ వేసేందుకు నిర్ణయం చెప్పాలని ప్రభుత్వాన్ని కోరింది.

అయితే.. గత విచారణ సందర్భంగా ప్రభుత్వం భిన్నంగా స్పందించింది. సమ్మె కేసు లేబర్ కోర్టులో ఉన్నందున కమిటీ అవసరం లేదని సర్కార్ వాదించింది. సమ్మె పూర్తిగా చట్టవిరుద్ధమని మరోసారి కోర్టుకు వివరించారు అడ్వకేట్ జనరల్. దీంతో.. తదుపరి వాదనలు వినేందుకు విచారణను నేటికి వాయిదా వేయింది కోర్టు. దీంతో న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

First published: November 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...