ఆర్టీసీ సమ్మెపై నేడు ఫైనల్‌గా తేల్చనున్న హైకోర్టు...

TSRTC Strike : ఆర్టీసీ సమ్మె 37 రోజులుగా కొనసాగుతోంది. ఇవాళ 38వ రోజు. ఇలా మనం రోజూ... రోజులు లెక్కపెట్టుకోవడమే తప్ప పెద్దగా డెవలప్‌మెంట్ ఏదీ కనిపించట్లేదు. ఇవాళ మాత్రం హైకోర్టు కీలక తీర్పు ఇస్తుంది. దానిపై చిన్న విశ్లేషణ.

news18-telugu
Updated: November 11, 2019, 6:57 AM IST
ఆర్టీసీ సమ్మెపై నేడు ఫైనల్‌గా తేల్చనున్న హైకోర్టు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
TSRTC Strike : ఆర్టీసీ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి రాకపోతే... ప్రైవేట్‌కి పర్మిట్స్ ఇచ్చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పడంతో... కంగారుపడొద్దని ఈ నెల 7న హైకోర్టు తన విచారణలో తెలిపింది. మరోసారి చర్చలు జరపమని సూచించింది. తన నిర్ణయమేంటో 11న చెబుతానంది. ఐతే... ప్రభుత్వం ఎలాంటి చర్చలూ జరపలేదు. సింపుల్‌గా చర్చల్లేవ్ అని తేల్చేసింది. నిన్న సీఎం కేసీఆర్ సమీక్ష జరిపి తీసుకున్న ఫైనల్ నిర్ణయం ఇదే. ఈ విషయాన్నే ఇవాళ హైకోర్టుకు చెబుతారు. తాము చర్చించుదామనుకున్నా ఆర్టీసీ జేఏసీ ముందుకు రాలేదని హైకోర్టుకు చెప్పబోతున్నారు. అప్పుడు ఆర్టీసీ స్టీరింగ్ హైకోర్టు చేతిలోకి వెళ్తుంది. హైకోర్టు ఏం చెబుతుంది? ప్రైవేట్‌కి పర్మిట్లు ఇచ్చేయమంటుందా? లేక కార్మికులు ఆ డిమాండ్ (ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం) వదులుకొని చర్చలకు వెళ్లాలని సూచిస్తుందా? అన్నది తేలుతుంది. హైకోర్టు గనక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే... వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. అదే జరిగితే... ఈ మేటర్ ఇప్పట్లో తేలదని మనం అనుకోవచ్చు.

ఆర్టీసీ ఇవాళ ఏం చేస్తుందంటే : ట్యాంక్‌బండ్‌పై ఛలో ట్యాంక్‌బండ్ సక్సెస్‌ఫుల్‌గా జరిగిందని భావిస్తున్న ఆర్టీసీ జేఏసీ... తమ నిరసనల్లో భాగంగా ఇవాళ మంత్రుల ఇళ్ల ముందు ఆందోళనలు చెయ్యమని పిలుపిచ్చింది. తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలనుకుంటోంది. ఈ ఆందోళనలకు కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు, టీడీపీ, తెలంగాణ జనసమితి సపోర్ట్ ఇస్తోంది. అంతేకాదు... జేఏసీ నాయకులు... 13, 14న ఢిల్లీలో జేఏసీ అధ్వర్యంలో మానవహక్కుల కమిషన్‌, జాతీయ మహిళా కమిషన్‌తో భేటీ అవుతారు. 18న రాష్ట్రవ్యాప్తంగా సడక్ బంద్‌కు పిలుపిచ్చారు.

Pics : మాలీవుడ్ బ్యూటీ రెమ్యా నంబీసన్ క్యూట్ ఫొటోస్ఇవి కూడా చదివేయండి :

క్లైమాక్స్‌కి మహారాష్ట్ర కహానీ... శివసేన సర్కార్ ఏర్పడే ఛాన్స్

ఏపీని ఆత్మహత్యలప్రదేశ్ చేశారు... వైసీపీపై చంద్రబాబు సెటైర్లు

Health Tips : బంగాళాదుంపల్ని ఇలా వండితే మేలు


Health Tips : వట్టి వేర్లతో ప్రయోజనమేంటి? తెలుసుకుందాం

1.2 కేజీల పీత... ఎంతకు అమ్ముడైందో తెలిస్తే షాకే...
Published by: Krishna Kumar N
First published: November 11, 2019, 6:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading