పోర్న్ వెబ్‌సైట్లపై హైకోర్టు ఆగ్రహం...గూగుల్‌కు నోటీసులు

దీనిపై విచారించిన హైకోర్టు.. పోర్న్ సైట్స్‌ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీరియస్ అయింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది.

news18-telugu
Updated: August 20, 2019, 3:23 PM IST
పోర్న్ వెబ్‌సైట్లపై హైకోర్టు ఆగ్రహం...గూగుల్‌కు నోటీసులు
హైకోర్టు(ఫైల్ ఫోటో)
  • Share this:
యువతను పెడదారి పట్టిస్తున్న అశ్లీల వెబ్‌సైట్లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అలాంటి వెబ్‌సైట్లపై గూగుల్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. అశ్లీల వెబ్‌సైట్లపై పూర్తి వివరాలు అందజేయాల్సిందిగా గూగుల్ సంస్థకు ఆదేశాలు జారీచేసింది. ఫేస్‌బుక్‌లో ఉన్న పేర్లు, ఫొటోలను సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి, పోర్న్‌సైట్లలో పెడుతున్నారని ఓ యువతి హైకోర్టును ఆశ్రయించింది. పోర్న్‌వెబ్‌సైట్ల నుంచి తన పేరు, ఫొటోలను తొలగించాలని గతంలో గూగుల్‌కి ఫిర్యాదు చేసినప్పటికీ.. ఆ సంస్థ పట్టించుకోకపోవడంతో బాధితురాలు కోర్టు మెట్లెక్కింది. దీనిపై విచారించిన హైకోర్టు.. పోర్న్ సైట్స్‌ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీరియస్ అయింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది.
Published by: Shiva Kumar Addula
First published: August 20, 2019, 3:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading