TELANGANA HIGH COURT RESPONSE ON STUDENTS LETTER ON COLLAGE SHIFTING VRY
TS High court : హైకోర్టుకు లేఖ రాసిన కాలేజీ విద్యార్థులు... స్పందించిన సీజే.. కారణం ఇదే...
ts high court
TS High court : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విద్యార్థులు లేఖ రాయడంతో ఆయన స్పందించారు. దీంతో వారి సమస్యపై కౌంటర్ ఫైల్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటివల సిటి సెంటర్లలో ఉండే ప్రభుత్వ సంస్థలను ఇతర ప్రాంతాలకు తరలిస్తూ.. వాటిని మరో అవసరానికి ఉపయోగిస్తున్నాయి. ఈ క్రమంలోనే మేడ్చెల్ ఐటిఐ తరలించేందుకు సిద్దమైంది. దాన్ని ఇతర ప్రాంతాలకు తరలించి ప్రస్తుతం ఉన్న ఐటిఐ స్థలాన్ని ఇతర కంపనీలకు కట్టబెట్టెందుకు ప్రభుత్వ అధికారులు పావులు కదుపుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. అయితే ఇప్పుడున్న ప్రాంతం నుంచి కళాశాలను దూరంగా తరలిస్తే ప్రయాణానికి ఇబ్బంది పడుతామన్నారు. ఎక్కువ మంది విద్యార్థులు స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ చదువుకుంటున్నారని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు.
విద్యార్థులు ( Students ) లేఖను సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన సీజే ధర్మాసనం ( ( Telangana High court ) ఇవాళ విచారణ చేపట్టింది. ఇప్పుడున్న ప్రాంతం నుంచి ఐటీఐ కళాశాలను తరలిస్తే పేద, మధ్య తరగతి విద్యార్థులు ఇబ్బంది పడతారని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రయాణ ఛార్జీలు భరించలేరని.. పార్ట్ టైం ఉద్యోగాలు కూడా కోల్పోతారని పేర్కొంది. పూర్తి వివరాలతో 8 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ( Government ) ఆదేశించింది. అప్పటివరకు తరలింపు ప్రక్రియను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 29కి వాయిదా వేసింది.
దీంతో కళాశాల తరలింపు చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులు నేరుగా లేఖలు రాయడం వాటి పరిష్కారాలకు న్యాయమూర్తులు నేరుగా స్పందించడం లాంటి సంఘటనలు కూడా వెలుగు చూశాయి. ఇటివల పలురాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో పాటు తెలంగాణకు చెందిన విద్యార్థులు సైతం తమ గ్రామ సమస్యలపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాయడంతో ఆయన స్పందించి సమస్యను పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.