తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేకు హైకోర్టులో చుక్కెదురైంది. తమను అకారణంగా అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారంటూ.. ముగ్గురు ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ విచారించిన కోర్టు నేడు తీర్పును వెలువరించింది. ఈ క్రమంలోనే సస్పెషన్ పై స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.కాగా విచారణలో భాగంగా అసెంబ్లీ కార్యదర్శికి నోటిసులు పంపిణ హైకోర్టు తాజాగా స్టేకు నిరాకరించింది.
కాగా తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన రోజు కాసేపటికి గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలను ప్రారంభించిన ప్రభుత్వం వైఖరిపై బీజేపీ అప్పటికే నల్ల జెండాలు ధరించి అసెంబ్లీలోకి ప్రవేశించారు. అనంతరం సమావేశాలు ప్రారంభమైన వెంటనే మంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగాన్ని ప్రారంభించడంతో. బీజేపీ ఎమ్మెల్యేలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో సభ ప్రారంభమైన పదిహేను నిమిషాలకే వారిని సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తూ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. దీంతో వెంటనే ఆ తీర్మాణానికి ఆమోదం తెలుపుతూ వారిని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అమోదిస్తూ వారి సస్పెషన్ ప్రకటించారు. దీంతో వారిని బలవంతంగా మార్షల్స్ బయటకు పంపించారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు ముందు బైఠాయించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఆ తర్వాత కోర్టుకు వెళ్లారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.