జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన దాఖలైన పిటిషన్‌పై ఈరోజు మరోసారి విచారించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది రచనారెడ్డి కోరింది. ఎన్నికల నోటిఫికేషన్లో రిజర్వేషన్లు సక్రమంగా లేవని కోర్టుకు తెలిపింది. అందుకే ఈ రోజు వాదనలు వినాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్‌ను కోరింది. అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని.. ఈ పిటిషన్‌పై ఇప్పుడే విచారణ జరపలేమని హైకోర్టు తెలిపింది. కాగా, రిజర్వేషన్లు రోటేషన్ పద్దతి లేకుండా ఎన్నికలు నిర్వహించడం చట్టవిరుద్ధమని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మున్సిపల్ యాక్ట్ 52Eను కూడా సవాలు చేశారు.
మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికలను ఆపాలంటూ కాంగ్రెస్ నేత దాసోజ్ శ్రవణ్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంపై హైకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్త చేసిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్దంగా రిజర్వేషన్లు అమలు చేశారని శ్రవణ తరఫు న్యాయవాది ఆ పిల్లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు .. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు పదేళ్ల క్రితం తీర్పు ఇస్తే ఇప్పటివరకు ఏం చేశారని.. ఎంబీసీలపై ప్రేముంటే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది. పిల్ విచారణ చేపడతాం కానీ.. ఎన్నికలపై స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
ఇక, గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో నేటి నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ నెల 20న నామినేషన్లకు అఖరి తేదీ. ఇక, డిసెంబర్ 1 ఎన్నికల పోలింగ్ నిర్వహించి, 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరపనున్నారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.