Telangana: న్యూ ఇయర్ వేడుకలు.. తెలంగాణ ప్రభుత్వం‌పై హైకోర్టు ఆగ్రహం.. ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్న

తెలంగాణ హైకోర్టు(:ఫైల్ ‌ఫొటో)

రాష్ట్రంలో కొత్త సంవత్సరం వేడుకలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. న్యూ ఇయర్ వేడుకలను రాష్ట్రంలో ఎందుకు బ్యాన్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

  • Share this:
    రాష్ట్రంలో కొత్త సంవత్సరం వేడుకలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. న్యూ ఇయర్ వేడుకలను రాష్ట్రంలో ఎందుకు బ్యాన్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. కొత్త రకం కరోనా వైరస్ ప్రమాదకరమని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ చెబుతుంటే.. నూతన సంవత్సరం వేడుకలకు ఎలా అనుమతి ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది.
    తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలకు పబ్‌లు, బార్‌లు విచ్చలవిడిగా ఓపెన్ చేసి ఉంచడం ద్వారా ఏం చేయాలనుకుంటున్నారని హైకోర్టు ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించింది. రాజస్తాన్, మహారాష్ట్రలలో న్యూ ఇయర్ వేడుకలను బ్యాన్ చేశారని ప్రస్తావించింది.

    ఇక, కరోనా వైరస్‌ను దృష్టిలో ఉంచుకుని న్యూ ఇయర్ వేడుకలను జరపుకోవద్దని ప్రజలకు సూచించినట్టు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే దీనిపై స్పందించిన హైకోర్టు న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఈ రోజు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈరోజు రాత్రి 144 సెక్షన్‌ విధించే అవకాశాలను కూడా పరిశీలించాలని పేర్కొంది. భౌతిక దూరం, ఫేస్ మాస్క్‌లు తప్పనిసరిగా వినియోగించేలా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించిన పూర్తి నివేదిక జనవరి 7న సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది.

    కాగా, హైదరాబాద్‌లో కొత్త సంవత్సర వేడుకలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు కూడా అనుమతి లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. అయితే రాష్ట్రంలో డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి వరకు వైన్ షాపులు తెరిచే ఉంటాయని అబ్కారీశాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు బార్‌లు, క్లబ్‌లు ఒంటి గంట వరకు తెరిచి ఉంచడానికి అనుమతులు ఇచ్చింది. అయితే వైన్ షాప్‌ల వద్ద, బార్‌లు, క్లబ్‌ల్లో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.
    Published by:Sumanth Kanukula
    First published: