Home /News /telangana /

TELANGANA HIGH COURT QUESTIONS GOVERNMENT ON SECRETARIAT DEMOLITION AK

సచివాలయం కూల్చివేతపై తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు సూటి ప్రశ్న..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భవనాల కూల్చివేతకు అనుమతి అవసరం లేదని ఏజీ కోర్టుకు వివరించారు. కేవలం భవనాల నిర్మాణాలకు మాత్రమే అనుమతి అవసరమని తెలిపారు.

    పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం భవనాల కూల్చివేయాలంటే కేంద్రం రెగ్యులేటరీ అనుమతి తీసుకోవాలన్న తెలంగాణ హైకోర్టు... సంబంధిత శాఖ అనుమతి తీసుకున్నారా అని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే భవనాల కూల్చివేతకు అనుమతి అవసరం లేదని ఏజీ కోర్టుకు వివరించారు. కేవలం భవనాల నిర్మాణాలకు మాత్రమే అనుమతి అవసరమని తెలిపారు. ఇప్పుడు తాము ఎలాంటి నిర్మాణం చేపట్టడం లేదని అన్నారు. నూతన నిర్మాణాలు చేపట్టేటప్పుడు అన్ని అనుమతులు తీసుకుంటామని చెప్పారు. పర్యావరణ అనుమతులకు సంబంధించి పలు తీర్పులను సమర్పిస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు.

    మరోవైపు ప్రభుత్వ కౌంటర్‌కు పిటిషనర్ చిక్కుడు ప్రభాకర్ రిప్లై కౌంటర్ దాఖలు చేశారు. పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం 2018కి విరుద్ధంగా కూల్చివేత పనులు చేపడుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు... కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. భవనాల కూల్చివేతపై స్టే రేపటి వరకు కొనసాగుతుందని తెలిపింది. సొలిసిటర్ జనరల్ గురువారం విచారణకు హాజరు కావాలని హైకోర్టు అదేశించింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Telangana, Telangana High Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు