ఆర్టీసీ సమ్మెపై కొనసాగుతున్న విచారణను తెలంగాణ హైకోర్టు ఈ నెల 15న వాయిదా వేసింది. దీనిపై రెండు గంటల పాటు విచారణ కొనసాగింది. అన్ని వాదనలు విన్న హైకోర్టు... పూర్తి వివరాలతో మరోసారి కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 15న మరోసారి దీనిపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. మరోవైపు ప్రజలు ఆర్టీసీ సమ్మె ద్వారా ఎదురవుతున్న కష్టాలు తొలగించేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బస్ పాస్‌లను అనుమతిస్తున్నారా ? లేదా ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
తాము నెల రోజుల ముందే సమ్మె నోటీసు ఇచ్చామని... ప్రభుత్వం తమ నోటీసులకు స్పందించకపోవడం వల్లే సమ్మెకు వెళ్లామని ఆర్టీసీ కార్మిక సంఘాల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరోవైపు తాము సమస్యలు పరిష్కరించేలోపే కార్మికులు సమ్మెకు వెళ్లారని ప్రభుత్వం తరపున న్యాయవాది తమ వాదన వినిపించినట్టు తెలుస్తోంది. సమ్మె కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, High Court, Telangana Government, Telangana High Court, TSRTC Strike