తెలంగాణ సచివాలయం కూల్చివేత మరింత ఆలస్యం

తెలంగాణ సచివాలయం

తెలంగాణ సచివాలయం కూల్చివేత అంశంపై కొనసాగుతున్న స్టేను ఈ నెల 15 వరకు పొడిగించింది రాష్ట్ర హైకోర్టు.

  • Share this:
    తెలంగాణ సచివాలయం కూల్చివేత అంశంపై కొనసాగుతున్న స్టేను ఈ నెల 15 వరకు పొడిగించింది రాష్ట్ర హైకోర్టు. భవనాల కూల్చివేత అనుమతులపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. కేబినెట్ నిర్ణయాన్ని సీల్డ్ కవర్‌లో సమర్పించాలని ఆదేశించింది. ఈ రోజు సాయంత్రమే సమర్పిస్తామన్న ఏజీ కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. అంతకుముందు తెలంగాణ సచివాలయం కూల్చివేతలను హైకోర్టు శుక్రవారం తాత్కాలికంగా నిలిపివేసింది.


    సోమవారం వరకు సచివాలయం కూల్చివేత పనులను నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేత పనులు నిలిపివేయాలని కోరుతూ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాజాగా ఈ కేసు విచారణను హైకోర్టు 15కు వాయిదా వేయడంతో... సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది.
    Published by:Kishore Akkaladevi
    First published: