కమిటీకి సర్కార్ నో... ఆర్టీసీపై విచారణ 18కి వాయిదా
ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.
news18-telugu
Updated: November 13, 2019, 5:22 PM IST

కేసీఆర్, ఆర్టీసీ
- News18 Telugu
- Last Updated: November 13, 2019, 5:22 PM IST
ఆర్టీసీ సమ్మెపై విచారణను తెలంగాణ హైకోర్టు ఈ నెల 18కు వాయిదా వేసింది. అంతకుముందు సుప్రీంకోర్టు మాజీ జడ్జిలతో కమిటీ వేయాలని సూచించిన హైకోర్టు ప్రతిపాదనకు ప్రభుత్వం ఒప్పుకోలేదని ఏజీ కోర్టుకు తెలిపారు. సమ్మె కేసు లేబర్ కోర్టులో ఉన్నందున కమిటీ అవసరం లేదని సర్కార్ వాదించింది. కార్మికులతో చర్చల ప్రసక్తే లేదని మరోసారి తేల్చి చెప్పింది. సమ్మె పూర్తిగా చట్టవిరుద్ధమని మరోసారి కోర్టుకు వివరించారు అడ్వకేట్ జనరల్. అయితే సమ్మె చట్టవిరుద్ధం అని ఎలా చెబుతారని హైకోర్టు ఏజీని ప్రశ్నించింది. గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఏజీ హైకోర్టు ముందుంచారు. 2015లో ఎస్మాపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 9ని ప్రస్తావించారు. ఆరు నెలలకు ఒకసారి ఎప్పటికప్పుడు జీవోను పొడిగిస్తారని తెలిపారు. గతంలో ఇచ్చిన జీవో 180 అంశాన్ని కూడా ఏజీ ప్రస్తావించారు. అయితే ఉమ్మడి ఏపీలో ఇచ్చిన జీవో 180 తెలంగాణకు వచ్చిందని హైకోర్టు స్పష్టంచేసింది.
ఇదిలా ఉంటే ఆర్టీసీ సమ్మె పరిష్కారం కోసం కమిటీ వేయాలని పిటిషనర్ తరపు లాయర్ రాపోలు కోర్టును కోరారు. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. సమస్యను తొందరగా పరిష్కరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు 27 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తుచేశారు. హైపవర్ కమిటీ వేసి సమస్యను పరిష్కరించాలని పిటిషనర్ తరపు లాయర్ కోర్టును వేడుకున్నారు. కానీ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిరాకరించిందని కోర్టుకు ఏజీ వెల్లడించారు. మరోవైపు ప్రభుత్వం తీసుకున్న రూట్ల ప్రైవేటీకరణ నిర్ణయంపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

కేసీఆర్ను ఢీకొట్టేందుకు ఢిల్లీలో మాస్టర్ ప్లాన్...
కవితకు వాళ్లబ్బాయి పంపించిన ఫన్నీ కొటేషన్.. ఏంటో తెలుసా..?
ఢిల్లీలో కాళ్లు పట్టుకుంటారు.. ఇక్కడేమో.. : టీఆర్ఎస్పై లక్ష్మణ్ విసుర్లు
కేసీఆర్కు ఈసారైనా ఛాన్స్ ఇస్తారా ?
'మద్యం వల్లే దిశ హత్య'.. కేసీఆర్ను టార్గెట్ చేసిన బీజేపీ
కవితకు కీలక పదవి... కేసీఆర్ సంకేతాలు...టీఆర్ఎస్లో చర్చ