తెలంగాణ స్పీకర్, 10 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు...

High Court : విలీనం చట్ట విరుద్ధం అని కాంగ్రెస్ చెబుతుంటే... కాంగ్రెస్ చేసినప్పుడు లేదా అని రివర్స్ అవుతున్నారు టీఆర్ఎస్ నేతలు. మరి హైకోర్టు ఏం చెప్పబోతోంది?

Krishna Kumar N | news18-telugu
Updated: June 11, 2019, 2:31 PM IST
తెలంగాణ స్పీకర్, 10 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు...
తెలంగాణ హైకోర్టు (File)
  • Share this:
టీఆర్ఎస్ శాసన సభా పక్షంలో... కాంగ్రెస్ శాసన సభా పక్షాన్ని విలీనం చెయ్యడం... 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో కలిపేసుకోవడంపై కాంగ్రెస్ నేతలు రెండు పిటిషన్లతో హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఒక పిటిషన్‌లో ఈ అంశంపై ఇవాళ జరగాల్సిన విచారణను బుధవారానికి వాయిదా వేసింది హైకోర్టు. రెండో పిటిషన్‌లో తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. స్పీకర్‌తోపాటూ... టీఆర్ఎస్‌లోకి మారిన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చింది. అసెంబ్లీ కార్యదర్శి, ఈసీకి కూడా నోటీసులు పంపింది హైకోర్టు. ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, చిరుముర్తి లింగయ్య, హరిప్రియ, ఉపేందర్ రెడ్డి, కాంతారావు, ఆత్రం సక్కు, హర్షవర్ధన్, వనమా వెంకటేశ్వరరావు, సబిత, సురేందర్‌కు నోటీసులు ఇచ్చింది హైకోర్టు. ఇదివరకు ఈ అంశంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారించిన హైకోర్టు తాజా నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది.

తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి... ఈ విలీన ప్రక్రియను సమర్థించారు. ఈ నెల 6న అసెంబ్లీ సెక్రెటరీ జారీచేసిన బులెటిన్‌-10ని సస్పెండ్‌ చేయాలని కోరుతూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిన్న హైకోర్టుకు వెళ్లారు. ఆ 12 మంది ఎమ్మెల్యేలూ కాంగ్రెస్‌ సభ్యులు అనీ... కాంగ్రె‌స్ టికెట్‌పై గెలిచారని తెలిపారు. ఒక రాజకీయ పార్టీని మరో పార్టీలో విలీనం చేసే అధికారం స్పీకర్‌కు లేదని అన్నారు. ఎన్నికల కమిషన్‌కు మాత్రమే అలాంటి అధికారం ఉంటుందని వివరించారు.

పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇచ్చిన కంప్లైంట్లను సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 90 రోజుల్లో పరిష్కరించాలనీ, అది మానేసి... విలీనాన్ని సమర్థించడం చట్ట విరుద్ధం అంటున్నారు భట్టి విక్రమార్క. ఇవాళ ఈ అంశంపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపడుతుందని అనుకున్నా, కోర్టు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

కాంగ్రెస్ డిమాండ్లు :
* ఎర్రబెల్లి దయాకర్‌రావు–తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ల కేసులో సుప్రీంకోర్టు... పార్టీ పిరాయింపుల కంప్లైంట్ అందిన 90 రోజుల్లో పరిష్కరించాలని స్పీకర్‌కు ఇచ్చిన ఆదేశాలు ఈ కేసులో అమలు చేయాలని స్పీకర్‌ను హైకోర్టు ఆదేశించాలి.
* స్పీకర్‌ తీసుకున్న విలీన నిర్ణయాన్ని రద్దు చేయాలి.
* స్పీకర్‌ ఆదేశాలతో అసెంబ్లీ సెక్రెటరీ విడుదల చేసిన బులిటెన్‌ 10ను సస్పెండ్‌ చెయ్యాలి.* పార్టీ పిరాయించిన 12 మందిపై ఉన్న అనర్హత కంప్లైంట్‌పై నిర్ణయం తీసుకున్న తర్వాతే స్పీకర్‌ ఇతర అంశాలపై నిర్ణయాలు తీసుకునేలా ఆదేశించాలి.ఇవి కూడా చదవండి :

మానవ జాతికే ప్రమాదం... మాంస భక్షక మొక్కలు...

అన్ని సబ్జెక్టుల్లోనూ 35 మార్కులే... ఇలా పాసైన స్టూడెంట్ ఇతనొక్కడేనేమో..?

చందమామలో భారీ వింత లోహం... ఆశ్చర్యపోతున్న సైంటిస్టులు...
Published by: Krishna Kumar N
First published: June 11, 2019, 11:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading