TELANGANA HIGH COURT OUTRAGED OVER GADWALAS PREGNANCY BN
గద్వాలలో గర్భిణీ మృతిపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి ఆదేశం..
తెలంగాణ హైకోర్టు
రెడ్ జోన్లలో నోడల్ అధికారులను ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం కల్పించాలని, ఆస్పత్రుల్లో గర్భిణీలకు వైద్య సేవలందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.
కాన్పు కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగి తిరిగి సకాలంలో వైద్యం అందక గద్వాలలో యువతి, పసికందు మృతి చెందిన ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ చేపట్టింది. న్యాయవాది కిషోర్ కుమార్ రాసిన లేఖపై విచారణ చేపట్టిన హైకోర్టు, యువతి కుటుంబానికి పరిహారం చెల్లింపుపై కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఘటనపై విచారణ జరుగుతోందని, నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. రెడ్ జోన్లలో కరోనాయేతర వైద్య సేవల కోసం అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని హైకోర్టు స్పష్టం చేసింది. రెడ్ జోన్లలో నోడల్ అధికారులను ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం కల్పించాలని, ఆస్పత్రుల్లో గర్భిణీలకు వైద్య సేవలందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. గర్భిణీలను ఆస్పత్రులకు తీసుకెళ్లే ప్రైవేట్ వాహనాలకు పాస్లు అడగొద్దని, ఆస్పత్రుల్లో గర్భిణీలు, క్యాన్సర్, గుండె జబ్బులకు చికిత్సలు నిరాకరించడకుండా చూడాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 19కి హైకోర్టు వాయిదా వేసింది.
Published by:Narsimha Badhini
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.