మల్లన్న సాగర్ కేసులో ముగ్గురు అధికారులకు జైలు

కాళేశ్వరం ప్రాజెక్టు మూడో యూనిట్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న సిద్దిపేట ఆర్డీవో జయచంద్రా రెడ్డి, తొగుట తహసీల్దార్ ఎల్.వీర్ సింగ్,నీటి పారుదల శాఖ గజ్వేల్ డివిజన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ టి.వేణు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు నిర్ధారించింది.

news18-telugu
Updated: July 5, 2019, 7:44 PM IST
మల్లన్న సాగర్ కేసులో ముగ్గురు అధికారులకు జైలు
తెలంగాణ హైకోర్టు (File)
news18-telugu
Updated: July 5, 2019, 7:44 PM IST
మల్లన్న సాగర్ నిర్వాసితులకు పరిహారం విషయంలో కోర్టు ధిక్కరణకు పాల్పడిన ముగ్గురు అధికారులపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముగ్గురు అధికారులకు జైలు శిక్ష విధించింది. రూ.2వేలు జరిమానా విధించింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు వల్ల తాము నష్టపోతున్నామంటూ గతంలో సిద్ధిపేట జిల్లా వేముల ఘాట్‌కు చెందిన 70 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. చట్ట ప్రకారం వారికి పునరావాసం కల్పించాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే, అధికారులు కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా, తమకు పరిహారం ఇవ్వకుండా ప్రాజెక్టు పనులు చేపడుతున్నారంటూ మళ్లీ రైతులు కోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు మూడో యూనిట్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న సిద్దిపేట ఆర్డీవో జయచంద్రా రెడ్డి, తొగుట తహసీల్దార్ ఎల్.వీర్ సింగ్,నీటి పారుదల శాఖ గజ్వేల్ డివిజన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ టి.వేణు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు నిర్ధారించింది. వారికి మూడు నెలల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించింది.

First published: July 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...