Home /News /telangana /

TELANGANA HIGH COURT NOTICES TO MINISTER PUVVADA AJAY KUMAR REGARDING SAI GANESH SUICIDE CASE AK

Puvvada Ajay Kumar: సాయిగణేశ్ ఆత్మహత్య కేసు.. మంత్రి పువ్వాడ అజయ్‌కు హైకోర్టుకు నోటీసులు

పువ్వాడ అజయ్ కుమార్ (ఫైల్ ఫోటో)

పువ్వాడ అజయ్ కుమార్ (ఫైల్ ఫోటో)

Sai Ganesh Suicide Case: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో పాటు మొత్తం 8 మందికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమ నోటీసులపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

    తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన సాయిగణేశ్ ఆత్మహత్య కేసులో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు నోటీసులు జారీ అయ్యాయి. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో (Puvvada Ajay Kumar) పాటు మొత్తం 8 మందికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమ నోటీసులపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు(Telangana High Court) ఆదేశించింది. సాయిగణేశ్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరపాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మంత్రి పువ్వాడ అజయ్ వేధింపుల వల్లే సాయిగణేశ్ (Sai Ganesh Suicide) ఆత్మహత్య చేసుకున్నాడని బీజేపీ ఆరోపిస్తోంది. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.

    రాష్ట్రానికి చెందిన దర్యాప్తు సంస్థల విచారణతో బాధితుడి కుటుంబానికి న్యాయం జరగదని ఆ పార్టీ వాదిస్తోంది. మంత్రి అజయ్ కుమార్ వేధింపుల వల్లే సాయిగణేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని అతడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. మరోవైపు ఇప్పటికే సాయిగణేశ్ కుటుంబసభ్యులను బీజేపీ నేతలు పరామర్శించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా షా ఫోన్‌లో సాయిగణేశ్ కుటుంబసభ్యులను ఓదార్చారు.

    ఈ నెల 14న ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ముందు సాయి గణేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 16న తుదిశ్వాస విడిచాడు. ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో సాయి గణేష్ మీడియాతో మాట్లాడాడు. తనపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అక్రమంగా 16 కేసులు నమోదు చేయించారని ఆరోపించాడు. ఈ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టుగా సాయి గణేష్ తెలిపారు.

    Hanmakonda student: హన్మకొండలో దారుణం.. ప్రేమించడం లేదని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థినిపై ప్రేమోన్మాది దాడి

    TRS MLA brother: టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే సోదరుడు నన్ను చేయి పట్టుకుని లాగాడు.. మీడియా ముందు ఓ మహిళ ఆక్రందన

    అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సాయి గణేష్ నుండి మరణ వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సాయి గణేష్ మీడియాకు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఆందోళనలు చేస్తున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Puvvada Ajay Kumar, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు