హోమ్ /వార్తలు /తెలంగాణ /

telangana : సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు టీహైకోర్టు అంగీకారం -ఏపీలో మాత్రం రూ.5కూ చూడొచ్చు!

telangana : సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు టీహైకోర్టు అంగీకారం -ఏపీలో మాత్రం రూ.5కూ చూడొచ్చు!

తెలంగాణలో సినిమా టికెట్ల ధర పెంపు

తెలంగాణలో సినిమా టికెట్ల ధర పెంపు

వరుసపెట్టి పెద్ద సినిమాలు రానుండగా టికెట్ ధరలపై రెండు రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు ఇండస్ట్రీని ప్రభావితం చేయనున్నాయి. జగన్ సర్కారులా టికెట్ల ధరల్ని తగ్గించనప్పటికీ పెంపునకు మాత్రం కేసీఆర్ సర్కారు అంగీకరించలేదు. దీంతో థియేటర్ యాజమాన్యాలే కోర్టును ఆశ్రయించగా, అనుకూల తీర్పు వచ్చింది.

ఇంకా చదవండి ...

సినిమా థియేటర్లలో టికెట్ ధరలకు సంబంధించి ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో విభిన్న పరిణామాలు చోటుచేసుకున్నాయి. టికెట్ ధరలు పెంచుకోవచ్చని తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పగా, టీకప్పు ధరకే టికెట్ రేట్లను క్రమబద్ధీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బాలకృష్ణ అఖండ, అల్లు అర్జున్ పుష్ప, ప్రభాస్ రాధేశ్యామ్, ఎన్టీఆర్-రాంచరణ్ ఆర్‌ఆర్‌ఆర్‌.. ఇలా వరుసపెట్టి పెద్ద సినిమాలు రానుండగా టికెట్ ధరలపై రెండు రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు ఇండస్ట్రీని ప్రభావితం చేయనున్నాయి. జగన్ సర్కారులా టికెట్ల ధరల్ని తగ్గించనప్పటికీ పెంపునకు మాత్రం కేసీఆర్ సర్కారు అంగీకరించలేదు. దీంతో థియేటర్ యాజమాన్యాలే కోర్టును ఆశ్రయించగా, అనుకూల తీర్పు వచ్చింది. వివరాలివి..

తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు హైకోర్టు అంగీకరించింది. ధరలు పెంచుకోడానికి అనుమతివ్వాలంటూ థియేటర్ల యజమానులు దాఖలుచేసిన పిటిషన్ పై కోర్టు బుధవారం ఈ మేరకు తీర్పు చెప్పింది. అఖండ, ఆర్ఆర్ఆర్, పుష్ప, తదితర భారీ బడ్జెట్ సినిమాలకు ఒక్కో టికెట్ పై రూ.50 పెంచేందుకు అనుమతివ్వాలని థియేటర్ల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. కానీ ఆ వినతిపై కేసీఆర్ సర్కారు స్పందించలేదు. దీంతో యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. థియేటర్ యజమానుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. దాంతో భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ల ధరలు పెరగనున్నాయి. మరోవైపు,

Suryapet : కూతురు అలా మంచంపై ఉండగా తల్లిని కామ కోరిక తీర్చమన్నాడు.. ఆ రాత్రి జరిగింది చూసి తట్టుకోలేక..తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు భారీగా పెరగనుండగా, ఏపీలో మాత్రం ధరల్ని క్రమబద్ధీకరించారు. దీంతో చిన్న ఊళ్లలో కనిష్టంగా రూ.5కే సినిమా టికెట్ లభించనుంది. ఏపీ ప్రభుత్వం ఇటీవలే అసెంబ్లీలో ఏపీ సినిమాస్ రెగ్యులరైజేషన్ ఎమెండ్మెంట్ బిల్లును ఆమోదించిన దరిమిలా సినిమా టికెట్ల కొత్త రేట్లను బుధవారం ప్రకటించింది. ఏపీలో సినిమా టికెట్ ధర.. కప్పు ‘టీ’ ధర కంటే తక్కువ ఉండటం గమనార్హం. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన సినిమా టికెట్ల కొత్త ధరల ప్రకారం అత్యంత కనిష్ట ధర రూ.5 కాగా, అత్యంత గరిష్ట ధర రూ.250గా ప్రకటించారు.

Published by:Madhu Kota
First published:

Tags: Cinema, Telangana, Telangana High Court, Theaters, Ticket

ఉత్తమ కథలు