• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • TELANGANA HIGH COURT MAKES SERIOUS COMMENTS DEVARAYNAJAL LANDS PROBE SU

దేవరయంజాల్ భూములపై విచారణ.. నలుగురు ఐఏఎస్‌లతో కమిటీపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

దేవరయంజాల్ భూములపై విచారణ.. నలుగురు ఐఏఎస్‌లతో కమిటీపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ హైకోర్టు(ఫైల్‌ ఫొటో)

దేవరయాంజల్‌ భూములకు సంబంధించి జరుగుతున్న విచారణపై తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

  • Last Updated:
  • Share this:
    మేడ్చ‌ల్ జిల్లా శామీర్‌పేట మండ‌ల ప‌రిధిలోని దేవరయంజాల్‌లో ఆలయ భూములను ఆక్రమించారనే ఆరోపణపై విచారణ జరిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నలుగురు ఐఏఎస్‌లతో కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించిన విచారణపై తెలంగాణ హైకోర్టు శనివారం సంచలన వ్యాఖ్యలు చేసింది. దేవరయాంజల్ భూములకు సంబంధించి ఎప్పటి నుంచో ఉన్న వివాదంపై దర్యాప్తు జరిపేందుకు ఇప్పుడు తొందరెందుకని హైకోర్టు ప్రశ్నించింది. కరోనా విజృంభిస్తున్న వేళ నలుగురు ఐఏఎస్‌లతో విచారణ జరపాలా.. అంటూ ప్రభుత్వాన్ని అడిగింది. కరోనాతో రోగులు మరణిస్తుంటే లేని స్పందన.. ఈ అంశంపై ఎందుకు అని ప్రశ్నించింది. పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగా జీవోలు ఇస్తారా అని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మిగిలిన ఆలయాల పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

    అయితే హైకోర్టు ప్రశ్నలకు ఏజీ స్పందిస్తూ.. కమిటీ కేవలం ప్రాథమిక విచారణ మాత్రమే చేస్తుందని తెలిపారు. ఎవరినీ ఖాళీ చేయించటం, ఆక్రమించటం లేదని ఏజీ పేర్కొన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇప్పుడే కూల్చివేతలు వంటి చర్యలు ఉండవని ఏజీ కోర్టుకు విన్నవించారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ప్రాథమిక విచారణ కోసమైనా నోటీసులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కమిటీ విచారణకు సహకరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. వారి వివరణ తీసుకున్నాకే నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. అలాగే పిటిషనర్ల భూముల విషయంలో జోక్యం చేసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

    దేవర యంజాల్ భూములపై విచారణకు ప్రభుత్వం నలుగురు అధికారులతో కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఈ నెల 3న ప్రభుత్వం జారీ చేసిన జీవో 1014ను సవాల్‌ చేస్తూ పిటిషన్‌‌ దాఖలైంది. దేవరయాంజల్ భూముల వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని కోరారు. ఆ పిటిషన్‌పై నేడు న్యాయస్థానం విచారణ చేపట్టింది.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు