హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Telangana: నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Telangana: రాష్ట్రంలో వారాంతపు లాక్‌డౌన్‌పై నిర్ణయం ఎందుకు తీసుకోవడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

Telangana: రాష్ట్రంలో వారాంతపు లాక్‌డౌన్‌పై నిర్ణయం ఎందుకు తీసుకోవడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

Telangana: రాష్ట్రంలో వారాంతపు లాక్‌డౌన్‌పై నిర్ణయం ఎందుకు తీసుకోవడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

    తెలంగాణలో నైట్ కర్ఫ్యూ సమయం పెంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో వారాంతపు లాక్‌డౌన్‌పై నిర్ణయం ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. ఈ అంశంపై ఈ నెల 8 కంటే ముందే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై విచారణ చేపట్టిన హైకోర్టు.. సర్కార్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్టాలని స్పష్టం చేసింది. మాస్కులు ధరించకపోతే వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స ధరలను ప్రభుత్వమే నిర్ణయించాలని.. సిటి స్కాన్, ఆక్సిజన్ బెడ్స్, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ధరలపై జీవో జారీ చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఇందుకు సంబంధించి గతేడాది ఇచ్చిన జీవో ఇప్పటి అవసరాలకు పనికిరాదని హైకోర్టు తేల్చిచెప్పింది.

    ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్స్ వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచాలని పేర్కొంది. కరోనాకు సంబంధించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా చూడాలని ఆదేశించింది. రాష్ట్రంలో రోజుకు లక్ష కరోనా పరీక్షలు చేయాలని స్పష్టం చేసింది. ఏ పద్ధతిలో వ్యాక్సినేషన్ వేస్తున్నారో తెలిపాలని ప్రభుత్వానికి సూచించింది. ఏపీ నుంచి కరోనా కొత్త స్ట్రెయిన్ వస్తున్న నేపథ్యంలో సరిహద్దుల దగ్గర పటిష్ట చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. రాష్ట్రానికి సరిపడ మెడికల్ ఆక్సిజన్ అందించాలని కేంద్రానికి సూచించింది. ఈ విచారణకు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో టెస్టులు తగ్గించి కేసులు తగ్గాయని ఎలా చెప్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.అయితే రాష్ట్రంలో టెస్టులు పెంచామని పబ్లిక్ హెల్త్ ఆఫీసర్‌ కోర్టుకు తెలపగా.. దీనిపై స్పందించిన హైకోర్టు ఒక్క రోజు కూడా లక్ష టెస్టులు దాటలేదని విమర్శించింది. అసలు లాక్‌డౌన్ దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఫైర్‌ అయ్యింది. ప్రభుత్వాస్పత్రుల్లో బెడ్స్‌, ఆక్సిజన్ డేటాను పూర్తి వివరాలతో సమర్పించాలని ప్రభుత్వా‍న్ని హైకోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.

    First published:

    Tags: Lockdown, Telangana

    ఉత్తమ కథలు