డెంగీ వ్యాప్తిపై హైకోర్టు ఆందోళన...తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు

రాష్ట్రంలో అత్యవసర పరిస్థితులు తలపిస్తున్నాయని..నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని స్పష్టంచేసింది.

news18-telugu
Updated: August 30, 2019, 6:21 PM IST
డెంగీ వ్యాప్తిపై హైకోర్టు ఆందోళన...తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. నగరవాసులు మంచాలకే పరిమితమవుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో డెంగీ వ్యాప్తిపై తెలంగాణ హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. డెంగీ నియంత్రణకు సంబంధించి వారం రోజుల్లోగా పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వ్యాధి నియంత్రణకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇప్పటి వరకు ప్రభుత్వ ఏం చర్యలు తీసుకుందో సెప్టెంబర్‌ 7లోగా సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది.

డెంగీ వ్యాప్తిపై కరుణ అనే డాక్టర్ దాఖలు చేసిన పిల్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో డెంగీ తీవ్రత ఎక్కువగా ఉందని, కొన్ని వేలాది విద్యార్థులు డెంగీతో బాధపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని..డెంగీ నిర్మూలనకు చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. దీనిపై స్పందించిన కోర్టు..తాము కూడా నిత్యం వార్తల్లో చూస్తున్నామని తెలిపింది. రాష్ట్రంలో అత్యవసర పరిస్థితులు తలపిస్తున్నాయని..నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని స్పష్టంచేసింది.
Published by: Shiva Kumar Addula
First published: August 30, 2019, 6:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading