ఆర్టీసీలోని పలు రూట్లను ప్రైవేటీకరించడంపై హైకోర్టు విచారణ చేపట్టింది. 5,100 రూట్ల ప్రైవేటీకరణపై తెలంగాణ కేబినెట్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీంతో కేబినెట్ ప్రొసీడింగ్స్‌ను కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ఆర్టీసీ కార్పొరేషన్ కూడా కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. కేసు విచారణను ఈ నెల 11కు వాయిదా వేసిన హైకోర్టు... అప్పటి వరకు రూట్ల ప్రైవేటీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వానికి సూచించింది. ఆర్టీసీ సమ్మె కారణంగా 5,100 రూట్లలో ప్రైవేట్ ఆపరేటర్లకు అనుమతి ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
ఇందుకు సంబంధించి రవాణాశాఖ త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. దీనిపై ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు అనే వ్యక్తి హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేయడంతో... ఈ అంశంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5వ తేదీ లోపు విధుల్లో చేరకపోతే మిగతా 5,100 రూట్లను కూడా ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో... దీనిపై హైకోర్టు ఏం చెబుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Telangana High Court, Tsrtc, Tsrtc privatization