MLC Venkatramireddy : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డికి కోర్టు ధిక్కారణ నోటిసులు జారీ అయ్యాయి. కోర్టుకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై ఆయన చేత క్షమాపణ చెప్పిస్తానని ఏజీ కోర్టుకు చెప్పారు.
ఇటివలే ఎమ్మెల్సీగా ఎన్నికైన మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. (contempt of court notice to mla Venkatram Reddy )ఆయన కోర్టుకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై ధిక్కారణ నోటిసు జారీ చేసింది.కాగా ఆయన సిద్దిపేట కలెక్టర్ ఉన్న సమయంలో కోర్టు వరి విత్తనాలు , వెయవద్దని చెప్పడంతోపాటు దుకాణాదారులు కూడా ఎవరు అమ్మకూడదని హెచ్చరించారు. దీంతో పాటు దీనిపై హైకోర్టు నుండి ఆదేశాలు తెచ్చిన తాను లెక్క చేయనని చెప్పరంటూ ఆరోపణలు వచ్చాయి.
అయితే ఆయన వ్యాఖ్యలపై కోర్టు ధిక్కార పిటిషన్ ధాఖలు కావడంతో నేడు విచారణ జరిగింది. ( contempt of court notice to mla Venkatram Reddy ) దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే కేసును వాదించిన ఏజీ ఆయన చేత క్షమాపణ చెప్పిస్తానని కోర్టుకు తెలిపారు. దీంతో కేసును మరో నాలుగు వారాలకు వాయిదా వేశారు.
మరోవైపు ఆయన కలెక్టర్ రాజీనామా పై హైకోర్టులో పిల్ వేశారు.( Telangana high court ) రాజీనామాను కేంద్రం అమోదించకుండానే ఎమ్మెల్సీగా నామినేషన్ వేశారని పిటిషన్లోలో పేర్కోన్నారు. కలెక్టర్‌గా డీవోపీటి ( DOPT ) అమోదం తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు. ఇక ఆయనపై అధికార దుర్వినియోగం కేసు ఉందని అయినా రాజీనామాను అమోదించడంపై టీకాంగ్రెస్ అధ్యక్షుడు ( Revanth reddy ) రేవంత్ రెడ్డి సైతం ఎన్నికల కమీషన్‌కు సైతం ఫిర్యాదు చేశారు.
కాగా వేసవి కాలంలో వరి ధాన్యం వేయవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రైతులను కోరింది. వరి వేస్తే.. ఉరి అంటూ ప్రచారం చేసింది. దీంతో కలెక్టర్‌గా ఉన్న వెంకట్రామిరెడ్డి సైతం రైతులతో పాటు ధాన్యం విత్తనాలు అమ్మె డీలర్లతో సమావేశం ఏర్పాటు చేయడంతో ఇలాంటీ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలపై రైతుల్లో ఆందోళన మదలైంది. రాజకీయంగా కూడా అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ల మధ్య బహిరంగ మాటల యుద్దంతోపాటు ఒకరిపై ఒకరు దీక్షలు, ధర్నాలు చేపట్టారు. చివరికి ఇదే అంశంపై తేల్చుకునేందుకు సీఎం కేసిఆర్ సైతం ఢిల్లీకి వెళ్లి మకాం వేశారు. డిల్లీ వెళ్లిన మంత్రుల బృందం మంత్రి కేటీఆర్ తో సహా ఇతర మంత్రులు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో సమావేశం అయ్యారు. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని కోరారు. యాసంగి పంట కొనుగోలుతో పాటు, ప్రస్తుత సీజన్లో సమారు 40 లక్షల టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.