Home /News /telangana /

TELANGANA HIGH COURT GREEN SIGNAL TO SECRETARIAT BUILDINGS AK

సచివాలయ భవనాల కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

తెలంగాణ పాత సచివాలయం(ఫైల్ ఫోటో)

తెలంగాణ పాత సచివాలయం(ఫైల్ ఫోటో)

సచివాలయ భవనాల కూల్చివేతకు కేంద్ర అనుమతులు అవసరం లేదని అసిస్టెంట్ సోలిసీటర్ జనరల్ కోర్టుకు తెలిపారు.

  తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతకు అడ్డంకులు తొలిగిపోయాయి. సెక్రటేరియట్ కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కూల్చివేతలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌లను న్యాయస్థానం తోసిపుచ్చింది. సచివాలయ భవనాల కూల్చివేతకు కేంద్ర అనుమతులు అవసరం లేదని అసిస్టెంట్ సోలిసీటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. కేవలం నూతన నిర్మాణాలు చేపట్టడానికి మాత్రమే అనుమతులు అవసరమని స్పష్టం చేశారు. మరోవైపు నూతన నిర్మాణాలు చేపట్టే ముందు అన్ని అనుమతులు తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ వెల్లడించారు.

  ఇక తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియ దాదాపు 50శాతానికిపైగా పూర్తయ్యింది. తాజాగా హైకోర్టు కూల్చివేతలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో... ఈ పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. కొద్దిరోజుల్లోనే ఈ భనవాల కూల్చివేత ప్రక్రియను కూల్చివేసి... కొత్త సచివాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.

  అంతకుముందు ఇదే అంశంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 29న హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని జీవన్‌రెడ్డి తన పిటిషన్‌లో కోరారు. అయితే సచివాలయ కూల్చివేత అంశంపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Telangana, Telangana High Court, Telangana new secretariat

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు