తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ఇవాళ తలపెట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. భైంసా సిటీకి 3 కిలోమీటర్ల దూరంలో మాత్రమే సభ నిర్వహించుకోవాలని హైకోర్టు తెలిపింది. అలాగే భైంసా సిటీ గుండా పాదయాత్ర వెళ్లకూడదని సూచించింది. పాదయాత్రలో పాల్గొన్నవారు ఎలాంటి ఆయుధాలూ వాడకూడదని తెలిపింది. ఈ షరతులకు ఒప్పుకుంటేనే.. పాదయాత్ర చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకు బీజేపీ వర్గాలు అంగీకరించినట్లు తెలిసింది.
మరోవైపు తెలంగాణ .. నిర్మల్ జిల్లా.. భైంసాలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. అది ఇవాళ, రేపు అమల్లో ఉంటుంది. ఈ కారణంగా భైంసాలో భారీగా పోలీసులు మోహరించారు. రెవెన్యూ అధికారులు 144 సెక్షన్ అమలైందని చెబుతుంటే.. స్థానిక పోలీసులు మాత్రం అమల్లో లేదంటున్నారు.
ఐదో విడత ఎలా?
ఐదో విడత పాదయాత్రలో భాగంగా భైంసా నుంచి కరీంనగర్ (Karimnagar) వరకు తలపెట్టారు. 20 రోజుల పాటు 222 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. మొత్తం 5 జిల్లాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, 8 అసెంబ్లీ నియోజక వర్గాల్లో యాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 17వ తేదీ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 14,15,16 తేదీలో చొప్పదండిలో యాత్ర కొనసాగగా.. డిసెంబర్ 16,17న కరీంనగర్లో పాదయాత్ర సాగగా చివరి రోజు కరీంనగర్ (Karimnagar) లోని SR నగర్ కళాశాల వద్ద పాదయాత్ర ముగియనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana News