ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ పర్యటనకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకే రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఓయూకు వస్తున్నారని పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టుకు వివరించారు. గతంలో వివిధ పార్టీలు కూడా ఓయూలో సమావేశాలు నిర్వహించాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంలో ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. ఓయూలో(Osmania University) రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ వీసీని ఆదేశించింది. ఈ నెల 6 తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు రాహుల్ గాంధీ. ఆ రోజు వరంగల్లో(Warangal) ఏర్పాటు చేయబోతున్న బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.
ఆ మరునాడు 7న రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో ముఖాముఖి అయ్యేలా కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ ప్లాన్ చేసింది. అయితే ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ అనుమతి నిరాకరించారు. దీంతో ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ తరపున పలువురు కోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీ ఓయూ పర్యటనకు అనువతి ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
దీనిపై వాదనలు విన్న హైకోర్టు.. రాహుల్ గాంధీ ఓయూ పర్యటనకు అనుమతి ఇవ్వాలని ఉస్మానియా యూనివర్సిటీ వీసీని ఆదేశించింది. అయితే ఓయూలో రాహుల్ గాంధీతో సహా కేవలం 150 మందికి మాత్రమే అనుమతి ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. ఈ అంశంలో తమకు హైకోర్టు నుంచి సానుకూల తీర్పు రావడం పట్ల కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణలో కాంగ్రెస్ విజయమని ఆ పార్టీ నేతలు అభివర్ణించారు.
CM KCR వ్యూహంతోనే ప్రశాంత్ కిషోర్ కొత్త జాతీయ పార్టీ: తప్పైతే పాస్ పోర్ట్ సీజ్: KA Paul
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీని ఓయూకు రాకుండా టీఆర్ఎస్, ప్రభుత్వం కుట్ర చేసిందని.. అయితే ఆ కుట్రలు సాగలేదని అన్నారు. ఓయూకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాహుల్ గాంధీని తీసుకొస్తామన్న ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఈ తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలతో తమకు న్యాయం జరిగిందని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rahul Gandhi, Telangana