డెంగీ మరణాలపై హైకోర్టు ఆగ్రహం.. కేసీఆర్ సర్కారుకు చీవాట్లు..

రాష్ట్రంలో డెంగీ వ్యాప్తిపై తెలంగాణ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. డెంగీ జ్వరాలపై ఇప్పటికే సర్కారుకు నోటీసులు జారీచేసిన హైకోర్టు.. తాజాగా వ్యాధి వ్యాప్తిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగీ వ్యాప్తిపై కరుణ అనే డాక్టర్ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది.

news18-telugu
Updated: October 24, 2019, 12:32 PM IST
డెంగీ మరణాలపై హైకోర్టు ఆగ్రహం.. కేసీఆర్ సర్కారుకు చీవాట్లు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. నగరవాసులు మంచాలకే పరిమితమవుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో డెంగీ వ్యాప్తిపై తెలంగాణ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. డెంగీ జ్వరాలపై ఇప్పటికే సర్కారుకు నోటీసులు జారీచేసిన హైకోర్టు.. తాజాగా వ్యాధి వ్యాప్తిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగీ వ్యాప్తిపై కరుణ అనే డాక్టర్ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో డెంగీ తీవ్రత ఎక్కువగా ఉందని, కొన్ని వేలాది విద్యార్థులు డెంగీతో బాధపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని..డెంగీ నిర్మూలనకు చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. ప్రభుత్వం తరఫున కోర్టు ముందు చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ హజరు కాగా.. ఏసీ రూముల్లో కూర్చొని తమాషా చేస్తున్నారా అని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 3,800 డెంగీ కేసులు నమోదైతే ప్రభుత్వం తక్కువ కేసులు చూపెడుతోందని ఫైర్ అయ్యారు.

డెంగీ నివారణకు చర్యలు తీసుకున్నామని సీఎస్ ఎస్కే జోషి కోర్టుకు చెప్పగా.. నివారణ చర్యలు తీసుకుంటే వ్యాధి కేసులు ఎందుకు నమోదవుతున్నాయని ప్రశ్నించింది. సీఎస్ వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. డెంగీ మరణాలపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఒక సారి మూసీనదిని పరిశీలించాలని అధికారులను ఆదేశించింది.

రాజస్థాన్ , మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కూడా నది మధ్యలోనే ఉన్నాయని, అక్కడ లేని డెంగ్యూ మరణాలు ఇక్కడే ఎందుకు ఉన్నాయని, మూసీని ఆనుకొని ఉన్న హైకోర్టులోనూ దోమలు ఉన్నాయని స్పష్టం చేసింది. డెంగీ వ్యాధిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైతే మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని సూచించింది.
Published by: Shravan Kumar Bommakanti
First published: October 24, 2019, 12:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading