కరోనా వెరస్ మహమ్మారి నేపథ్యంలో తెలంగాణలోని వివిధ న్యాయస్థానాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకునేందుకు హైకోర్టు కోవిడ్ నిధిని ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారి చికిత్సకు ప్రభుత్వం కల్పించే మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకం వర్తించడం లేదు. దీంతో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. దీన్ని గుర్తించిన హైకోర్టు.. రాష్ట్రంలోని పలు న్యాయస్థానాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వైద్య అవసరాల కోసం కోవిడ్ నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. రాష్ట్రంలో న్యాయాధికారులందరూ విరాళం ఇవ్వాలని హైకోర్టు కోరింది.
దీంతో కొవిడ్ నిధికి పలువురు హైకోర్టు న్యాయమూర్తులు ముందుకొచ్చారు. ఇదిలావుంటే.. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఆన్‌లైన్ పిటిషన్ల దాఖలు విధానాన్ని జూలై 20 వరకు కొనసాగించాలని హైకోర్టు నిర్ణయించిన విషయం విదితమే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.