Home /News /telangana /

TELANGANA HIGH COURT CONTINUED STAY ON NON AGRICULTURAL LAND REGISTRATION IN DHARANI PORTAL NS

Tealngana: కేసీఆర్ సర్కార్ కు హై కోర్టు షాక్.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Dharani Portal: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హై కోర్టు మరో సారి షాక్ ఇచ్చింది. ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై గ‌తంలో ఇచ్చిన‌ స్టేను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హై కోర్టు మరో సారి షాక్ ఇచ్చింది. ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై గ‌తంలో ఇచ్చిన‌ స్టేను ధర్మాసనం జూన్ 21 వరకు పొడిగించింది. ఈ మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ధరణిపై దాఖలైన ఏడు పిల్స్ పై జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనం విచారణ చేప‌ట్టింది. అయితే.. ఒకే అంశంపై అనేక పిటిషన్లు అవసరం లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో ఐదు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టు తోసిపుచ్చింది. ధరణిపై 2 పిల్స్ పై మాత్రమే విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. ధరణి పై వస్తున్న అభ్యంతరాలను మంత్రివర్గ ఉప సంఘం పరిశీలిస్తోందని ఏజీ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం వైఖరి తెలిపేందుకు సమయం కావాలని ఆయన కోరారు. దీంతో స్పందించిన ధర్మాసనం గ‌తంలో ఇచ్చిన స్టేను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంటూ విచార‌ణ వాయిదా వేసింది.

    ఇదిలా ఉంటే.. ధరణి పోర్టల్‌ను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. భూ సమస్యల పరిష్కారం కోసం పారదర్శకంగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. ఒక్క రూపాయి కూడా లంచం చెల్లించాల్సిన పనిలేకుండా.. ధరణిని తీర్చిదిద్దారు. అందులో భాగంగా తహసీల్దారు, ఆర్డీవో, జిల్లా రెవెన్యూ కోర్టులను రద్దు చేసిన విషయం తెలిసిందే. వాటి స్థానంలో జిల్లా ట్రైబ్యునళ్లను ఏర్పాటుచేశారు. ఐతే వాటి సేవలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. వివాదాల పరిష్కారానికి ట్రైబ్యునల్ సభ్యులు కలెక్టర్, అదనపు కలెక్టర్లు సమయం కేటాయిస్తున్నారు. రోజుకు రెండు మండలాల చొప్పున ఎంపిక చేసి.. పెండింగ్‌లో ఉన్న వివాదాల్లోని భూ యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. తగిన ఆధారాలతో ట్రైబ్యునళ్లను ఆశ్రయించాల్సిందిగా సూచిస్తున్నారు.

    ఆయా కేసులను విచారిస్తున్న కలెక్టర్లు.. అవసరమైన చోట క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టేందుకు జిల్లాకు ఇద్దరు తహసీల్దార్లు, నలుగురు డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లను నియమించారు. వివాదాల పరిష్కారానికి ట్రైబ్యునళ్లకు ప్రభుత్వం నెల రోజుల గడువు ఇచ్చిన నేపథ్యంలో పక్రియను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న వివాదాలకు పరిష్కారం దొరుకుతుందని రైతులు భావిస్తున్నారు. ఇప్పటికైనా వివాదాలకు చెక్ పడుతుందని ఎదురుచూస్తున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: CM KCR, Dharani Portal, Telangana, Telangana High Court

    తదుపరి వార్తలు