• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • TELANGANA HIGH COURT COMMENTS ON LOCKDOWN DECISION TAKEN BY CM KCR GOVERNMENT AK

Telangana: తెలంగాణలో లాక్‌డౌన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..కనీసం ఆ ఆలోచన కూడా చేయకుండా..

Telangana: తెలంగాణలో లాక్‌డౌన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..కనీసం ఆ ఆలోచన కూడా చేయకుండా..

ప్రతీకాత్మక చిత్రం

Lockdown in Telangana: ఇంత హఠాత్తుగా రేపటి నుంచి లాక్‌డౌన్ అంటే ఎలా ? అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

  • Share this:
    తెలంగాణలో రేపటి నుంచి పది రోజుల పాటు లాక్‌డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇదే విషయాన్ని హైకోర్టుకు తెలియజేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంత హఠాత్తుగా రేపటి నుంచి లాక్‌డౌన్ అంటే ఎలా ? అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇవాళ ఉదయం 10 గంటల వరకు ప్రభుత్వానికి కనీసం వీకెండ్ లాక్‌డౌన్ ఆలోచన కూడా లేదని.. అలాంటి ఒకేసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్ నిర్ణయం తీసుకుంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాల ప్రజలు ఇంత తక్కువ టైమ్‌లో ఎలా వారి ప్రాంతాలకు వెళ్లిపోతారని వ్యాఖ్యానించింది.

    గత ఏడాదిలా వలస కూలీలు ఇబ్బంది పడకూడదని పేర్కొంది. రోజూవారీ కూలి చేస్తూ బతికేవాళ్లు, వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించింది. రెండో డోస్ వ్యాక్సిన్‌పై ప్రజల్లో అయోమయం ఉందని తెలిపింది. మందుల రేట్లు, ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక బిల్లులపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం ఇంత క్లిష్ట పరిస్థుల్లో ఉంటే ఆస్పత్రులపై చర్యలు తీసుకోమని ఎలా చెబుతామని వ్యాఖ్యానించింది. అంతర్రాష్ట్ర సరిహద్దుల దగ్గర అంబులెన్స్‌లు ఎందుకు నిలిపేస్తున్నారని ప్రశ్నించింది.

    హైదరాబాద్ అనేది మెడికల్ హబ్, ఆరోగ్యం కోసం ఎంతోమంది ఇక్కడికి వస్తారని.. ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చేవారిని ఎలా అడ్డుకుంటారని హైకోర్టు వ్యాఖ్యానించింది. అంబులెన్స్‌లపై రేపు నిర్ణయం తీసుకుంటామని ఏజీ తెలిపారు. లాక్‌డౌన్ సందర్భాల్లో ఎమర్జెన్సీ పాసులు ఇస్తామని తెలిపారు. అయితే రేపటి వరకు ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలన్న హైకోర్టు ప్రశ్నించింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు