TELANGANA HIGH COURT BENCH JUDGES POSTS ARE INCREASED FROM 24 TO 42 VRY
Telangana high court : హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు...ఏపి కంటే అదనంగా 5గురు న్యాయమూర్తులు
Telangana high court : హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు...ఏపి కంటే అదనంగా 5గురు న్యాయమూర్తులు
Telangana high court : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెరగింది. ప్రస్తుతం ఉన్న సంఖ్యకు అదనంగా 18 మంది న్యాయమూర్తులను కేటాయిస్తూ... కేంద్ర న్యాయశాఖ అనుమతి ఇవ్వడంతో.. చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ అమోదముద్ర వేశారు..దీంతో తెలంగాణలో ప్రస్తుతం 24 మంది న్యాయమూర్తులు ఉండగా పెంచిన సంఖ్యతో మొత్తం 42కు చేరింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదనంగా న్యాయమూర్తులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసింది..దీంతో చాలా కాలం తర్వాత చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ చొరవతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో ప్రస్థుతం ఉన్న న్యాయమూర్తుల సంఖ్య 24 నుండి 42కు పెంచుతూ కేంద్రన్యాయ శాఖతో పాటు,సీజెఐ కీలక నిర్ణయం తీసుకున్నారు..
అయితే ఇందుకోసం కేంద్ర న్యాయశాఖకు అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, హైకోర్టు, సుప్రిం కోర్టుల నుండి విజ్ఝప్తులు వెళ్లడం, ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్వీ రమణ దేశంలో పెండింగ్ ఉన్న వివిధ హైకోర్టుల ప్రతిపాదనలు పరీశీలించారు. వీటిని కేంద్ర న్యాయశాఖతోపాటు ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలోనే మరోసారి కేంద్రన్యాయశాఖ మంత్రికి లేఖ రాశారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వినతులతోపాటు ఇక్కడ ఉన్న పరిస్థితులను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఇందుకు సంబంధించి రాష్ట్ర హైకోర్టులో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని, అక్కడ మొత్తం 42 మందికి అవరమైన మౌళిక వసతులు సైతం ఉండడతోపాటు అదనంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఏమి లేదని వివరించారు..సీజేఐ లేఖతో స్పందించిన కేంద్రన్యాయ శాఖ, న్యాయమూర్తుల పెంపుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. ప్రస్థుతం ఉన్న సంఖ్య 24 నుండి 42కు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది..దీంతో సోమవారం సుప్రిం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆమోదం తెలిపారు. ఇక పెంపుదల సంఖ్య సోమవారం నుండే అధికారికంగా అమల్లోకి రానుందని అధికారిక వర్గాలు వెళ్లడించాయి..అయితే.. దీనిపై కేంద్ర న్యాయశాఖ అధికారికి ఉత్తర్వులు వెల్లడించాల్సి ఉంది..
కాగా ప్రస్తుతం తెలంగాణలో సుమారు రెండున్నర లక్షల కేసులు పెండింగ్లో ఉండగా వాటిలో 2.10 వేలు సివిల్ , మరో 40వేల క్రిమినల్ కేసులు ఉన్నట్టు సమాచారం. ఈ కేసులను విచారించేందుకు ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తులపై భారం ఎక్కువవుతుండడంతో పాటు పెండింగ్ కేసులు పేరుకుపోయో అవకాశాలు ఉండడం, ఏపీ ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటు చేసుకున్న తర్వాత అందుకు తగ్గట్టుగా కేసులను పరిష్కరించే మౌళిక వసతులు కూడా ఉండడంతో కొత్త పోస్టులు మంజూరు అయ్యాయి..
వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన మూర్తుల సంఖ్యతో పోలిస్తే..తెలంగాణ 13వ స్థానంలో ఉంది..ముఖ్యంగా తెలంగాణ కంటే అధిక జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో 37 పోస్టులు ఉండగా తాజాగా పెంచిన వాటితో తెలంగాణకు అదనంగా 5 పోస్టులు దక్కాయి. ఇక ఎక్కువ మొత్తంలో అలహాబాద్ హైకోర్టులో 160 న్యాయమూర్తుల పోస్టులుండగా, ముంబయి హైకోర్టుకు 94,పంజాబ్,హరియాణకు 85,తమిళనాడులోని చెన్నై హైకోర్టుకు 75, కోల్కతాకు 72, కర్ణాటకలో 62, దిల్లీలో 60, ఎంపీలో 53, బీహార్లో 53,గుజరాత్లో 52 రాజస్థాన్ హైకోర్టుకు 50 కేరళ హైకోర్టుకు 47 పోస్టులు ఉన్నాయి..
న్యాయమూర్తుల పెంపు కోసం అప్పటి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు..అయితే దాన్ని కొద్ది రోజుల పాటు పెండింగ్ పెట్టడడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరోసారి లేఖ రాయడం, చీఫ్ జస్టీస్ ఎన్వీరమణ చొరవతో కేంద్రం కూడా సానుకూలంగా స్పందించడంతో అదనపు పోస్టులను కేటాయించారు...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.