Home /News /telangana /

High court: 16 ఏళ్ల బాలిక అబార్షన్‌కు అనుమతి.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

High court: 16 ఏళ్ల బాలిక అబార్షన్‌కు అనుమతి.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

తెలంగాణ హైకోర్టు(:ఫైల్ ‌ఫొటో)

తెలంగాణ హైకోర్టు(:ఫైల్ ‌ఫొటో)

Green Signal to Abortion: మన దేశంలో గర్భస్రావం చట్ట రీత్యా నేరం.. కానీ మానవతా కోణంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అబార్షన్ చేయించుకునేందుకు అనుమతి ఇచ్చింది. తాజా తీర్పుపై అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.. అసలు కారణం ఏంటంటే..?

ఇంకా చదవండి ...
    Telangana Higchourt: మహిళ కడుపులో పెరుగుతున్న పిండాన్ని తొలగించడం లేదా బయటకు వెళ్లిపోయేలా చేయడాన్ని గర్భస్రావం అంటారు. ఈ ప్రక్రియ గర్భానికి ముగింపు పలుకుతుంది. మనుషుల ప్రమేయం లేకుండా జరిగే అబార్షన్‌ను మిస్ క్యారేజ్ లేదా ఆకస్మిక గర్భస్రావం (spontaneous abortion) అంటారు. 30 నుంచి 40 శాతం గర్భిణులకు ఇలా జరిగే ప్రమాదం ఉంది. ఉద్దేశపూర్వకంగా గర్భస్రావం చేయడాన్ని ప్రేరేపిత గర్భస్రావం (induced abortion or miscarriage) అంటారు. అబార్షన్‌ అనే పదానికి ఇదే అసలైన అర్థంగా భావిస్తారు. ఆకస్మిక గర్భస్రావాన్ని న్యాయపరమైన, వైద్య పరిభాషలో అబార్షన్‌గా పరిగణించరు. దీనికి చట్టం అంగీకరించదు. అయితే తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సంచలన తీర్పు ప్రకటించింది. అత్యాచారానికి గురైన బాలిక దాల్చిన గర్భాన్ని తొలగించేందుకు అనుమతిచ్చింది. 16 ఏళ్ల బాలిక 26 వారాల పిండాన్ని తొలగించాలని కోఠి ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. నిపుణులతో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డి ఈమేరకు కీలకకు తీర్పు వెలువరించారు.. 16ఏళ్ల బాలికపై సమీప బంధువు ఆంజనేయులు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా.. గర్భవతిగా వైద్యులు నిర్ధారించారు. అవాంఛితగర్భాన్ని తొలగించాలని బాలిక, ఆమె తల్లి కోరగా... కోఠి ప్రసూతి ఆసుపత్రి వైద్యులు నిరాకరించారు. ఆమె తల్లి ద్వారా బాలిక హైకోర్టును ఆశ్రయించారు.

    బాలిక ఆరోగ్యపరిస్థితిపై వైద్యుల కమిటీని ఏర్పాటు చేసిన హైకోర్టు .. నివేదిక సమర్పించాలని ఆదేశించింది. పరీక్షలు జరిపిన వైద్యుల కమిటీ.. పిండం వయసు 25 వారాలుగా తేల్చి.. కొన్ని జాగ్రత్తలతో నిపుణులు అబార్షన్‌ చేయవచ్చని సూచించింది. వివిధ అంశాలను పరిశీలించిన హైకోర్టు బాలికకు అబార్షన్‌ చేయాలని ఆదేశించింది.

    ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో అత్యంత మహిళా ధనవంతురాలు ఎవరో తెలుసా..? ఆస్తుల విలువ ఎంతంటే

    చట్ట ప్రకారం 24 వారాలకు మించి వయసు ఉన్న పిండం తొలగింపునకు ఆదేశాలు ఇచ్చే అధికారం రాజ్యాంగ కోర్టులకు ఉందని తెలిపింది. గర్భం కోరుకునే హక్కుతో పాటు.. చట్టపరిమితులకు లోబడి వద్దనుకునే హక్కు కూడా ఉంటుందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దురదృష్ట ఘటనతో వచ్చిన అవాంఛనీయ గర్భాన్ని తొలగించకపోతే.. తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడి ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదముందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.ఇదీ చదవండి: ఛీ.. వ్యూస్‌ కోసం ఇంత దారుణమా..? ఓ తండ్రి పనిపై నెటిజన్ల మండిపాటు..? వైరల్ అవుతున్న వీడియో

    తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల పుట్టబోయే శిశువు ఆరోగ్యంపై ప్రభావం ఉండొచ్చునని పేర్కొంది. పిండం హక్కుల కంటే అత్యాచార బాధితురాలికి రాజ్యాంగం కల్పించిన హక్కులే ప్రాధాన్యమని స్పష్టం చేసింది. హుందాగా, ఆత్మగౌరవంతో, ఆరోగ్యకరంగా జీవించే హక్కు మహిళలకు ఉందని పేర్కొంది. అన్ని జాగ్రత్తలతో.. నిపుణులతో గర్భవిచ్చిత్తి ప్రక్రియ చేపట్టాలని కోఠి ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించింది. పిండం నుంచి రక్తం, కణజాలం, డీఎన్ఏ సేకరించి ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపించాలని తెలిపింది. ఫోరెన్సిక్ లేబొరేటరీ నివేదికలు వచ్చిన తర్వాత... కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులకు పంపించాలని తీర్పులో పేర్కొంది.
    First published:

    Tags: High Court, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు