హోమ్ /వార్తలు /తెలంగాణ /

Video Viral: సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్..వీడియో వైరల్..ఆడేసుకుంటున్న నెటిజన్లు

Video Viral: సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్..వీడియో వైరల్..ఆడేసుకుంటున్న నెటిజన్లు

కేసీఆర్ కాళ్లు మొక్కుతున్న హెల్త్ డైరెక్టర్

కేసీఆర్ కాళ్లు మొక్కుతున్న హెల్త్ డైరెక్టర్

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మరో వివాదానికి తెర లేపారు.  నిన్న టీఆర్ఎస్ భవన్ లో కేసీఆర్ కాళ్లు మొక్కుతూ హెల్త్ డైరెక్టర్ అడ్డంగా బుక్కయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. వీడియో చూసిన నెటిజన్లు హెల్త్ డైరెక్టర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.  కాగా కొంతకాలంగా కేసీఆర్ కు సన్నిహితంగా ఉంటున్నహెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు కేసీఆర్ కాళ్లు పట్టుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియోను షేర్ చేసిన మాజీ ఐపిఎస్ ఆకునూరి మురళి షాకింగ్ ట్వీట్ చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మరో వివాదానికి తెర లేపారు. నిన్న టీఆర్ఎస్ భవన్ లో కేసీఆర్ కాళ్లు మొక్కుతూ హెల్త్ డైరెక్టర్ అడ్డంగా బుక్కయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. వీడియో చూసిన నెటిజన్లు హెల్త్ డైరెక్టర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా కొంతకాలంగా కేసీఆర్ కు సన్నిహితంగా ఉంటున్నహెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు కేసీఆర్ కాళ్లు పట్టుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Telangana: పోలీస్ కొలువు కొట్టాలనుకున్నాడు..కానీ ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తుండగా గుండెపోటు..ఎస్సై అభ్యర్థి మృతి

ఈ వీడియోను షేర్ చేసిన మాజీ IAS ఆకునూరి మురళి షాకింగ్ ట్వీట్ చేశారు. కొత్తగూడెం అసెంబ్లీ TRSటికెట్ గురించే కదా Dr శ్రీనివాస్ CM కాళ్ళు పట్టుకోడం చేశారు. మీలాంటి అధికారులు బ్యూరోక్రసీ పరువు తీస్తున్నారు. మొన్న కొత్తగూడెం వెళ్ళినప్పుడు చూసా టౌన్ నిండా మీ ఫ్లెక్సీలే పదవి misuse చేస్తూ కొత్తగూడెంలో ఎదో కార్యక్రమాలు చేస్తున్నారని కొందరు నాతో అన్నారని ఆయన ట్వీట్ చేశారు. కాగా గతంలో కూడా కొంతమంది అధికారులు కేసీఆర్ కాళ్లు మొక్కిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భంలో వారిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

కొత్తగూడెం అసెంబ్లీ TRSటికెట్ గురించే కదా Dr శ్రీనివాస్ CM కాళ్ళు పట్టుకోడం. మీలాంటి అధికారులు బ్యూరోక్రసీ పరువు తీస్తున్నారు. మొన్న కొత్తగూడెం వెళ్ళినప్పుడు చూసా టౌన్ నిండా మీ ఫ్లెక్సీలే.పదవి misuse చేస్తూ కొత్తగూడెం లో ఎదో కార్యక్రమాలు చేస్తున్నారని కొందరు నాతో అన్నారు.వీడియో???? pic.twitter.com/VmX8DZYc5C

— Murali Akunuri (@Murali_IASretd) November 16, 2022

సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్న నెటిజన్లు:

ఈ వీడియో చూసిన నెటిజన్లు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.  కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నేడు బానిసత్వానికి కేరాఫ్ మారిందని మండిపడుతున్నారు. పదవి కాలం పొడిగించాలని కాళ్లు మొక్కుతున్నారా లేక కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్ కోసమా అని సెటైర్లు వేస్తున్నారు. మనిషిని ఆశ, స్వార్థం ఎంతవరకు అయిన దిగజార్చుతుందని పలువురు ట్వీట్ చేస్తున్నారు.

గతంలోనూ ఇలాంటి ఘటనలు:

అధికారులు కేసీఆర్ కాళ్లు మొక్కడం ఇది కొత్తేమి కాదు. గతంలో సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల కలెక్టరేట్ల ప్రారంభోత్సవంలో ఆయా జిల్లాల కలెక్టర్లు వెంకట్ రామిరెడ్డి , శరత్ కూడా కేసీఆర్ కాళ్లు మొక్కి వార్తల్లోకి ఎక్కారు. ఆ సమయంలో కలెక్టర్ల తీరు తీవ్ర చర్చనీయాంశం అయింది. అలాగే గతంలో మంత్రి సత్యవతి కూడా కేసీఆర్ కాళ్లు మొక్కారు. ఇప్పుడు హెల్త్ డైరెక్టర్ కేసీఆర్ కాళ్లు మొక్కడంతో కీలక పదవుల్లో ఉన్న అధికారులు కేసీఆర్ కాళ్లు మొక్కుతూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

First published:

Tags: CM KCR, Collector, Telangana, Telangana health director

ఉత్తమ కథలు