Home /News /telangana /

TELANGANA HARITHA HARAM CM KCR INAUGURATES SIXTH PHASE AT NARSAPUR URBAN FOREST PARK IN MEDAK DISTRICT BA

Haritha Haram | తెలంగాణలో ఆరో విడత హరితహారం.. కేసీఆర్ ఈ మొక్క నాటారు..

తెలంగాణలో ఆరో విడుత హరితహారం ప్రారంభోత్సవం

తెలంగాణలో ఆరో విడుత హరితహారం ప్రారంభోత్సవం

Telangana Haritha Haram | తెలంగాణలో ఆరో విడుత హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించారు.

    తెలంగాణలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతంలో అల్ల నేరేడు మొక్కను నాటి ఆయన శ్రీకారం చుట్టారు. 630 ఎకరాల్లో అభివృద్ది చేసిన నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. నర్సాపూర్ అడవుల్లో చేపట్టిన అటవీ అడవి పునరుద్ధరణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. అటవీ ప్రాంతంలో కాలి నడకన తిరుగుతూ అడవి పునరద్దరణ కోసం చేపట్టిన చర్యలను పరిశీలించారు. నేచురల్ ఫారెస్ట్, రాక్ ఫిల్ డ్యాం, వాటర్ హార్వెస్టింగ్ తదితర పనులను పరిశీలించారు. ఎతైన కొండపై నిర్మించిన వాచ్ టవర్ నుంచి ముఖ్యమంత్రి అటవీ ప్రాంతాన్నంతా సందర్శించారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాలయిన ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రమే ప్రస్తుతం అడవి ఉందని, ఆ ప్రాంతం కాక దట్టమైన అడవి వున్న ఎకైక ప్రాంతం రాష్ట్రంలో నర్సాపూర్ మాత్రమేనని ముఖ్యమంత్రి అన్నారు. ఈ అడవిని కాపాడుకోవడానికి, అటవీ ప్రాంతంలో పోయిన అడవిని పునరుద్ధరించడానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని కోరారు.

     
    First published:

    Tags: CM KCR, Haritha haram, Telangana

    తదుపరి వార్తలు