Home /News /telangana /

TELANGANA GRAM PANCHAYAT ELECTIONS 2019 TOSS ELECTS PANCHAYAT SARPANCH IN JARUPULA THANDA OF NALGONDA DISTRICT

బొమ్మా..బొరుసా..సర్పంచ్‌‌ని గెలిపించిన టాస్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టీఆర్ఎస్ అభ్యర్థి నిర్మలకు అనుకూలంగా టాస్‌ పడడంతో.. ఆమె సర్పంచిగా గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దాంతో నిరాశతో కాంగ్రెస్ అభ్యర్థి వెనుదిరిగారు.

  తండాలు పంచాయతీలుగా అవతారమెత్తిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు ఇవి. వందలోపు జనాభా ఉన్న తండాలకూ ఇప్పుడు సర్పంచ్‌లు రాబోతున్నారు. ఐతే కొన్ని గ్రామాల్లో అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధిస్తోంటే..మరికొన్ని గ్రామాల్లో ఒక్క ఓటుతో ఓడిపోతున్నారు. ఇంకొన్ని చోట్ల అభ్యర్థులకు సమానమైన ఓట్లు వస్తున్నాయి. విజయం దోబూచులాడుతూ ఇరువైపులా నిలుస్తోంది. అలాంటి గ్రామాల్లో టాస్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. బొమ్మ, బొరుసు వేసి సర్పంచిని ఎన్నుకుంటున్నారు.

  నల్గొండ జిల్లా చింతపల్లి మండలం జరుపులతండాలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. సోమవారం జరిగిన తొలి విడత పోలింగ్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులకు చెరి సమానంగా 169 చొప్పున ఓట్లు వచ్చాయి. దీంతో సర్పంచిని ఎంపిక చేసేందుకు అధికారులు టాస్‌ వేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి నిర్మలకు అనుకూలంగా టాస్‌ పడడంతో.. ఆమె సర్పంచిగా గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దాంతో కాంగ్రెస్ అభ్యర్థి నిరాశతో అక్కడి నుంచి వెనుదిరిగారు.

  తొలివిడతలో మొత్తం 4,479 పంచాయతీలు, 39,822 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. వీటిలో 769 పంచాయతీలు, 10,654 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దాంతో 3,701 పంచాయతీలు, 28,976 వార్డుల్లో ఎన్నికలు తప్పనిసరి కావడంతో పోలింగ్ నిర్వహించారు. తొలి విడత ఎన్నికల్లో 12,202 మంది సర్పంచి అభ్యర్థులు, వార్డులకు 70,094 మంది పోటీచేశారు. ఐతే అభ్యర్థిని బలపరిచిన రాజకీయ పార్టీతో పాటు స్థానికంగా అభ్యర్థికి ఉన్న పేరు దృష్టిలో ఉంచుకొని ఓటర్లు ఓటువేశారు.

  ఇది కూడా చదవండి

  సొంత ఓటు వేయడం మరిచారు...ఒక్క ఓటుతో ఓడిపోయారు..
  First published:

  Tags: Gram Panchayat Elections, Telangana

  తదుపరి వార్తలు