Home /News /telangana /

TELANGANA GRAM PANCHAYAT ELECTIONS 2019 COUPLE BUSY IN CAMPAIGN FORGET TO CAST VOTE THEY LOST THE ELECTION WITH ONE VOTE

ప్రచారంలో పడి సొంత ఓటు వేయడం మరిచారు...ఒక్క ఓటుతో ఓడిపోయారు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana gram panchayat elections 2019: తమకే ఓటు వేయాలంటూ వారినీ వీరినీ అడిగారు తప్ప సొంత ఓటు వేసుకోలేదు. ప్రచారంలో పడి ఓటు వేయడం మర్చిపోయారు. వాళ్లిద్దరు ఓటు వేసినట్లయితే ఒక్క ఓటు మెజార్టీతో ఆగం రెడ్డి గెలిచేవారు.

    ఓటు చాలా శక్తివంతమైనది. మన తలరాతల్ని మార్చే బ్రహ్మాస్త్రమది. ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే..! అది దేశ గతిని మార్చే ప్రధాని మంత్రి ఎన్నికలైనా..గ్రామ స్వరూపాన్ని మార్చే సర్పంచ్ ఎన్నికలైనా..! ఒక్క ఓటుతో అభ్యర్థులు ఓడిపోయిన సందర్భాలూ చాలానే ఉన్నాయి. ఒకే ఒక్క ఓటుతో అధికార పీఠంపై కూర్చున్న వాళ్లూ ఉన్నారు. తాజాగా తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఇలాంటి చిత్రవిచిత్రాలు చాలానే చోటుచేసుకున్నాయి. ఒక్క ఓటుతో సర్పంచ్ పదవిని కోల్పోయారో అభ్యర్థి. ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ప్రచారంలో పడి ఆ దంపతులు ఓటువేసుకోలేదు. సొంత ఓట్లు పడి ఉంటే..వాళ్లకే అధికారం దక్కేది.

    యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలంలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. రంగాపురం గ్రామంలో మర్రి ఆగంరెడ్డి, రామిడి ప్రభాకర్ రెడ్డి సర్పంచ్ బరిలో నిలిచారు. ఐతే ఒకే ఒక్క ఓటు తేడాతో రామిడి ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. మర్రి ఆగంరెడ్డి ఓడిపోయారు. ఐతే మర్రి ఆగంరెడ్డి దంపతులు మధ్యాహ్నం వరకు ప్రచారంలో నిమగ్నమయ్యారు. అందరి దగ్గరకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. తమకే ఓటు వేయాలంటూ వారినీ వీరినీ అడిగారు తప్ప సొంత ఓటు వేసుకోలేదు. ప్రచారంలో పడి ఓటు వేయడం మర్చిపోయారు. వాళ్లిద్దరు ఓటు వేసినట్లయితే ఒక్క ఓటు మెజార్టీతో ఆగం రెడ్డి గెలిచేవారు. కానీ దురదృష్టం వెక్కిరించింది. సొంత ఓటును నిర్లక్ష్యం చేయడంతో ఎన్నికల్లో ఓడిపోయారు ఆగం రెడ్డి.

    VIDEO: నదిలో పడవ మునిగి 8 మంది మృతి
    First published:

    Tags: Gram Panchayat Elections, Telangana

    తదుపరి వార్తలు