కేసీఆర్ కీలక నిర్ణయం.. ఆ 243 మంది రైతు కుటుంబాలకు పరిహారం..

ఆత్మహత్యలు చేసుకున్న 243 మంది రైతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ఇవ్వనుంది.

news18-telugu
Updated: August 1, 2019, 5:58 PM IST
కేసీఆర్ కీలక నిర్ణయం.. ఆ 243 మంది రైతు కుటుంబాలకు పరిహారం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం అందజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2019 - 20 ఆర్థిక సంవత్సరంలో (ఇప్పటి వరకు) ఆత్మహత్య చేసుకున్న 243 మంది రైతులకు ఈ పరిహారం అందించడానికి రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుంది. ఒక్కో కుటుంబానికి రూ.6లక్షల పరిహారం ఇవ్వనుంది. మొత్తం రూ.14.58 కోట్ల పరిహారాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. దీంతో రెవిన్యూ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణలోని 24 జిల్లాలకు చెందిన రైతుల కుటుంబాలకు ఈ పరిహారం అందనుంది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 45 మంది రైతుల కుటుంబాలకు పరిహారం అందించనుంది.

First published: August 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు