హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nalgonda :టైం కు రమ్మని మందలించిన ప్రభుత్వ హెడ్‌మాస్టర్... తట్టుకోలేని లేడి టీచర్ ఏం చేసిందంటే...?

Nalgonda :టైం కు రమ్మని మందలించిన ప్రభుత్వ హెడ్‌మాస్టర్... తట్టుకోలేని లేడి టీచర్ ఏం చేసిందంటే...?

file photo  (Image-Twitter)

file photo (Image-Twitter)

Nalgonda : తనను టైం రావడం లేదంటూ వేధిస్తుందని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మీద కక్ష పెంచుకుంది...ఇది భరించలేని టీచర్ తన భర్త సహాయంతో దాడి చేసేందుకు ప్రైవేటు గుండాలను ఉసిగొల్పి దాడి చేయించింది. చివరికి విషయం తెలియడంతో ఉద్యోగం నుండి సస్పెండ్ అయి ఇంట్లో కూర్చుంది.

ఇంకా చదవండి ...

విద్యార్థులకు విద్యాబుద్దులు,భవిష్యత్ ప్రణాళికలు రూపోందించాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.. తోటి ఉద్యోగినిపై కక్షపెంచుకుంది. తన భర్త సహాయంతో ఆమెపై కిరాయి గుండాలను పెట్టి దాడి చేయించింది. దాడి బయటపడకుండా వారి వద్ద నుండి బంగారం సైతం ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసిన సంఘటన నల్గొండలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే..తెలంగాణలోని నల్గొండ జిల్లా వాడపల్లి పాఠశాలలో ఉపాధ్యాయిని రజని పాఠశాలకు సక్రమంగా రావడం లేదని, తాను చెప్పినా వినడం లేదంటూ... ఆ స్కూలు ప్రధానోపాధ్యాయురాలు రాధిక.. జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది..ఈ పరిణామాల నేపథ్యంలోనే అధికారుల వద్ద సమస్యను పరిష్కరించుకోకుండా ఉపాధ్యాయురాలు రజని ..హెడ్‌మాస్టార్ రాధికపై కక్షను పెంచుకుంది.

దీంతో ఆమెను ఎలాగైన తన అదుపులో పెట్టుకోవాలని భావించిన రజని... ఆమె భర్త, శ్రీనివాసరెడ్డికి చెప్పింది. కాగా ఆయన కూడా స్థానిక మల్కాపట్నం ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు... దీంతో ఇద్దరు కలిసి ప్రధానోపాధ్యాయురాలు రాధికపై దాడి చేయించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే

ఈ నెల 19న ప్రధానోపాధ్యాయురాలు రాధిక దంపతులు కలిసి కారులో వస్తుండగా మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన ఆరుగురు వ్యక్తులు రామాపురం అడ్డరోడ్డు వద్దకు వచ్చి భార్యభర్తలను ఆపి దాడి చేశారు.అనంతరం దాడి బమటపడకుండా దోపిడి జరిగినట్టు చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగా వారి వద్ద ఐదు తులాల బంగారం ఎత్తుకెళ్లారు.

దీంతో హెడ్‌మాస్టర్ రాధిక దంపతులు కేసును గుంటూరు జిల్లా దాచెపల్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో రజని పాత్ర బయటపడింది. దంపతులపై దాడికి పాల్పడింది నల్గొండ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు.దాడికి పాల్పడిన ఏడుగురు వ్యక్తులను గుర్తించారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి గురజాల కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

మరోవైపు ప్రధానోపాధ్యాయురాలు రాధికపై దాడి కేసులో ప్రమేయం ఉండటంతో ఉపాధ్యాయ దంపతులు రజని, శ్రీనివాసరెడ్డిలను సస్పెండ్‌ చేస్తూ నల్గొండ జిల్లా డీఈఓ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

First published:

Tags: Crime news, Nalgonda police

ఉత్తమ కథలు