Home /News /telangana /

Hyderabad : మ్యుటేషన్‌లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం...ఇక అక్కడే పేరు మార్పిడి..!

Hyderabad : మ్యుటేషన్‌లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం...ఇక అక్కడే పేరు మార్పిడి..!

Hyderabad : మ్యుటేషన్‌లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం...ఇక అక్కడే పేరు మార్పిడి..!

Hyderabad : మ్యుటేషన్‌లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం...ఇక అక్కడే పేరు మార్పిడి..!

Hyderabad : మ్యుటేషన్‌లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యసాయేతర ఆస్తుల మ్యుటేషన్‌ ప్రక్రియను రిజిస్ట్రేషన్ శాఖకు అప్పగించింది. దీంతో ఇక నుండి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యుటేషన్‌ కూడా అక్కడే కానుంది. అయితే.. ప్రస్తుతానికి ఈ ప్రక్రియను కేవలం పాత భవనాల కొనుగోలు అమ్మకాలకు మాత్రమే పరిమితం చేశారు.

ఇంకా చదవండి ...
    వ్యవసాయ భూముల అమ్మకాలు కొనుగోలు ప్రక్రియలో పలు కీలక నిర్ణయాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయేతర ఆస్తులపై కూడా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే వ్యవసాయేతర ఆస్తుల మ్యుటేషన్ ప్రక్రియను రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లోనే పూర్తి చేయనున్నారు.ఇందుకోసం ఇప్పటికే వారం రోజులుగా ట్రయల్స్ నిర్వహించారు. అయితే ఈ ప్రక్రియను ప్రస్తుతానికి పాతభవనాలకు మాత్రమే మ్యుటేషన్ చేయనున్నారు. ఖాలీ స్థలాలు, కొత్త ఇళ్లను పాత పద్దతిలోనే మ్యుటేషన్ ప్రక్రియ కొనసాగనుంది.ఇందుకోసం సాంకేతిక పరమైన అంశాలను పూర్తి చేశారు. ఇప్పటి వరకు మ్యుటేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్న మున్సిపాలీటిలు, గ్రామ పంచాయితీల సర్వర్లను రిజిస్ట్రేషన్ల శాఖకు అనుసంధానం చేశారు.

    అయితే ఇప్పటి వరకు వ్యవసాయేతర ఆస్తుల మ్యుటేషన్ ప్రక్రియను స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీలే నిర్వహిస్తున్నాయి.కాగా ఇందుకోసం ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారు అనేక ఇబ్బందులకు గురయ్యేవారు. అమ్మకాలు కొనుగోళ్లు జరిగిన తర్వాత ఆయా కొనుగోలుదారుల పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మ్యుటేషన్ కోసం ..ముందుగా మీ సేవ ద్వార సంబంధిత ఆస్తి పత్రాలు అప్‌లోడ్ చేసి ధరఖాస్తు చేసుకోనువారు. ఆ తర్వాత ఆ రిసీట్‌ తీసుకుని పట్టణాల్లో అయితే..మున్సిపాలిటీలకు, గ్రామీణ ప్రాంతాలు వారు అయితే గ్రామా పంచాయితీ కార్యాలయాకు వెళ్లి ఈ ప్ర్రక్రియను పూర్తి చేసుకునేవారు. దీంతో వెంటనే పేరు మార్పిడి జరిగే అవకాశాలు ఉండేవి కావు.

    ప్రస్తుతానికి ఈ ప్ర్రక్రియంతా లేకుండా నేరుగా రిజిస్ట్రేషన్ శాఖకే మ్యుటేషన్ అధికారాన్ని బదాలయించారు. అక్కడే మ్యుటేషన్‌కు సంబంధించిన ఫీజును చెల్లిస్తున్నారు కాబట్టి వెంటనే మ్యుటేషన్ కూడా ఎలాంటి ప్రత్యేక ధరఖాస్తు లేకుండా పూర్తి చేయనున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ప్రాపర్టీ టాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్‌తో ఆస్తికిసంబంధించిన పన్నులు, అనుమతుల వివరాలను పరీశీలించి..అన్ని అనుమతులు సంక్రమంగా ఉన్నాయని భావిస్తే... మ్యుటేషన్ ప్రక్రియను కొనసాగించనున్నారు.

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Land registration, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు