Home /News /telangana /

TELANGANA GOVT RELEASES AGRICULTURE LOAN WAIVER GUIDELINES SK

తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. రుణమాఫీ మార్గదర్శకాలు రిలీజ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11 వరకు తీసుకున్న రుణాల్లో బకాయిలు ఉన్న వారికి మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబానికి రూ.లక్ష వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేయనుంది.

    రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11 వరకు తీసుకున్న రుణాల్లో బకాయిలు ఉన్న వారికి మాఫీ చేయాలని నిర్ణయించింది. కుటుంబానికి రూ.లక్ష వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేయనుంది. ఇక రూ.25 వేల లోపు రుణం ఉన్న వారికి ఒకే దఫాలో రుణం మాఫీ కానుంది. రూ.లక్ష వరకు రుణం ఉన్న వారికి నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని ప్రకటించింది. చెక్కుల ద్వారా రుణమాఫీ మొత్తాన్ని ప్రభుత్వం అందించనుంది. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణాలను మాఫీ చేస్తామని.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Agriculture, CM KCR, Farmers, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు