Dalit Bandhu : దళిత బంధు నిధులు వచ్చాయి..ఇక పంచడమే తరువాయి..

cm kcr

Dalit Bandhu : దళిత బంధుకు నిధులు విడుదలయ్యాయి.. ఇందుకోసం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కాగా పైలట్ ప్రాజెక్ట్ అమలు కోసం ఇప్పటికే విధి విధానాలు ఖరారు అయ్యాయి. ఈ నెల 16న హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా సీఎం ప్రారంభించనున్నారు.

  • Share this:
    దళిత బంధు అమలుకు ప్రభుత్వం 500 కోట్ల రూపాయల నిధుల విడుదలకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దళితుల అభివృద్దికి గాను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దళిత బంధులో భాగంగా అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది.ఇందుకోసం కార్యచరణ కూడా సిద్దం చేశారు.

    అయితే దళిత బంధు పథకం హుజూరాబాద్‌లో అమలు చేయడంపై ప్రతి పక్ష పార్టీలతో పాటు పలువురు కోర్టుకు సైతం వెళ్లారు. ఎన్నికల కోసమే దళిత బంధును అమలు చేస్తున్నారంటూ కొంతమంది హైకోర్టులో పిల్ వేశారు. అయితే కోర్టు మాత్రం పిల్‌ను స్వీకరించలేదు. దీంతో చట్టపరమైన అడ్డంకులు తొలగాయి.

    మరోవైపు దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.ఇందుకోసం పెద్ద ఎత్తున ఆందోళన సైతం చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేడు ఇంద్రవెళ్లి సభను సైతం ఏర్పాటు చేశారు. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా ను నిర్వహిస్తున్నారు. ప్రతి దళిత , గిరిజన కుటుంబానికి పదిలక్షల రూపాయలు ఇవ్వాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది.

    అయితే పైలట్ ప్రాజెక్ట్‌గా హుజూరాబాద్‌లో ప్రారంభించిన తర్వాత రాష్ట్రమంతట ఈ పథకాన్ని అమలు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోంది.ఇందుకోసం గతంలోనే దళిత ఎంపవర్‌మెంట్ స్కీం కింద వేయికోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించామని చెబుతున్నారు. ఇప్పుడు అవే నిధులు దళిత బంధు పేరిట ఖర్చు చేస్తున్నామని చెబుతున్నారు. మొత్తం మీద దళిత బంధు అమలును చేపట్టనుండడంతో హుజూరాబాద్ ఎన్నికలు మరింత హాట్ టాపిక్‌గా మారనున్నాయి..అయిదు వందల కోట్లను ప్రతి దళిత కుటుంబానికి అందజేస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో అన్ని పార్టీలు దీన్ని ఆహ్వానిస్తున్నా... అంతర్గతంగా దళితులు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే చర్చ కొనసాగుతోంది..

    కాగా ఎన్నికల షెడ్యుల్ ఏ క్షణమైన వస్తుందనే సమాచారంతో సీఎం కేసిఆర్ దత్తత గ్రామం వాసాల మర్రిలో కూడా ఏడు కోట్ల అరవై లక్షల రూపాయలను దళిత బంధు పథకంలో భాగంగా విడుదల చేశారు.. దీంతో షెడ్యుల్ వచ్చినా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బందును అమలు చేసేందుకు అవకాశం ఏర్పడింది.
    Published by:yveerash yveerash
    First published: