Home /News /telangana /

TELANGANA GOVT NO OBJECTIONS FOR TRANSFER OF STAFF WILLING TO GO TO ANDHRA PRADESH EVK

ఏపీ ఉద్యోగుల బదిలీకి తెలంగాణ ప్రభుత్వం ప‌చ్చ‌జెండా.. వెళ్లాలా? వద్దా? సందేహంలో ఉద్యోగులు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

తెలంగాణ‌లో ప‌ని చేస్తున్నఆంధ్ర‌ప్ర‌దేశ్‌(Andhra Pradesh) ఉద్యోగులు, అధికారుల‌ను వారి రాష్ట్రానికి బ‌దీలీ చేసేందుకు తెలంగాణ(Telangana)ప్ర‌భుత్వం ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ వెళ్లాల‌నుకొనే వారు అక్టోబ‌ర్ 15 క‌ల్లా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది.

ఇంకా చదవండి ...
    తెలంగాణ‌లో ప‌ని చేస్తున్న ఉద్యోగులు, అధికారుల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు బ‌దీలీ చేసేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ఆమోదించింది. ఇందు కోసం తెలంగాణ‌లో ప‌ని చేస్తున్న ఉద్యోగులు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌(Andhra Pradesh) కు వెళ్లాల‌నుకొనే వారు అక్టోబ‌ర్ 15 క‌ల్లా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఇక్క‌డ ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌ను ఏపీకి వెళ్లాలనుకొంటే త‌మ‌కెలాంటీ అభ్యంత‌రం లేద‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు పెండింగ్‌లో ఉన్న‌వారికి మాత్రం పంపించే అవ‌కాశం లేదని ఉత్త‌ర్వులో పేర్కొంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు బ‌దిలీపై వెళ్లేందుకు కావ‌ల్సిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. సెక్ర‌టేరియ‌ట్‌ (Secretariat) తోపాటు అన్ని శాఖ‌ల అధికారుల‌కు ఈ నియ‌మాలు వ‌ర్తిస్తాయ‌ని ప్ర‌భుత్వం తెలిపింది.
    రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత కొంత మంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉద్యోగులు తెలంగాణ‌(Telangana)లోనే ఉండిపోయారు.

    NEET 2021: ప్రాణం తీసిన భయం.. నీట్‌ ప‌రీక్ష‌ఫెయిల్ అవుతానని విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌


    ఆరు నెల‌ల కింద‌ట ఆంధ్రాలో ఉన్న తెలంగాణ ఉద్యోగుల‌ను తీసుకొచ్చారు. వారికి ఆయా శాఖ‌లను కేటాయించేందుకు ఇన్ని రోజుల స‌మ‌యం ప‌ట్టింది. ఆ ప్ర‌క్ర‌యి పూర్త‌యిన త‌రువాత తెలంగాణ‌లో ఉన్న ఆంధ్ర ఉద్యోగుల‌ను వారి రాష్ట్రాల‌కు పంపేందుకు ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో ఆస‌క్తి ఉన్న‌వారు త‌మ అభిప్రాయాన్ని అక్టోబ‌ర్ 15 (October 15th) లోగా తెల‌పాలి. సంబంధిత లిస్టును సిద్ధం చేసి ఏపీకి పంపుతారు.
    వెళ్లాలా.. వ‌ద్దా.. తీసుకుంటారా?
    విభ‌జ‌న సమ‌యానికి ప్ర‌స్తుతం ప‌రిస్థితుల‌కు తేడా వ‌చ్చింది. రాష్ట్రం విడిపోయిన‌ప్పుడు ఆంధ్ర‌ప్రదేశ్ ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు 60 సంవ‌త్స‌రాలు కాగా తెలంగాణ‌లో 58 సంవ‌త్స‌రాలు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు 61 సంవ‌త్స‌రాలు ఉన్న నేప‌థ్యంలో ఉద్యోగులు(Employees) ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వెళ్లాలా వ‌ద్దా అనే సంశయం ఏర్ప‌డింది.

    సంవ‌త్సరం ఉద్యోగ లాభాన్ని పోగొట్టుకొని ఎంత‌మంది ముందుకు వ‌స్తార‌నేది సందేహంగా ఉంది. అంతే కాకుండా తెలంగాణ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ఈ ఉత్త‌ర్వ‌ల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం స్పందించ‌లేదు. దీంతో ఆప్ష‌న్ ఎంపిక చేసి పంపిన త‌రువాత అక్క‌డి ప్ర‌భుత్వం స్పందించ‌కుంటే స‌మ‌స్య‌ల్లో ప‌డ‌తామ‌నే అభిప్రాయాన్ని ఉద్యోగుల‌కు వ్య‌క్తం చేస్తున్నారు. సుమారు వెయ్యి మంది ఉద్యోగులు   ఆంధ్రప్రదేశ్ వెళ్లేందుకు  ఆసక్తి చూపుతున్నారని ఉద్యోగవర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ ఉత్తర్వులపై   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందిస్తే తప్ప పూర్తి స్పష్టత రాదు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Telangana Government

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు