Home /News /telangana /

TELANGANA GOVT MENTIONED GULF EXPAT PROBLEMS IN BUDGET 2021 SAID THAT WAITING FOR REPORT ON KERALA SCHEMES HSN

Telangana Budget 2021: తెలంగాణ బడ్జెట్లో గల్ఫ్ కార్మికుల ప్రస్తావన.. కేరళ సర్కారు విధానాలపై వచ్చే నివేదికను బట్టి పథకాలు..!

హరీష్ రావు

హరీష్ రావు

ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి అక్కడ కష్టాల పాలవుతున్న తెలంగాణ పౌరుల సంక్షేమంపై కేసీఆర్ సర్కారు దృష్టి సారిస్తామని హామీ ఇచ్చింది. కేరళ విధానాలపై అధ్యయనం చేస్తున్నామనీ, నివేదిక అందగానే..

    సొంత ఊళ్లో ఉపాధి లేక, కుటుంబ కష్టాలను తీర్చేందుకు లక్షలాది మంది పౌరులు గల్ఫ్ దేశాల బాట పడుతున్న సంగతి తెలిసిందే. ఆ దేశాల్లో కఠిన చట్టాలను భరిస్తూ, కష్టాన్ని పంటిబిగువున ఓర్చుకుంటూ గల్ఫ్ కార్మికులు కుటుంబ సభ్యుల కోసం చెమటోడ్చుతుంటారు. వచ్చిన డబ్బును వచ్చినట్టే తమ ఇళ్లకు పంపిస్తుంటారు. పెద్ద సంఖ్యలో పౌరులు ఉపాధి కోసం గల్ఫ్ బాట పడుతుండటంతో వారి కోసం కేరళ సర్కారు ప్రత్యేక పథకాలను, వారి సంక్షేమం కోసం ఎన్నో స్కీములను ప్రవేశపెడుతుంటోంది. దుబాయి ప్రభుత్వంతో అయితే నేరుగా కేరళ సర్కారుకు సత్సంబంధాలే ఉన్నాయి. తాజాగా తెలంగాణ సర్కారు కూడా గల్ఫ్ కార్మికుల కష్టాలను తీర్చేందుకు ముందుకొచ్చింది.

    తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గురువారం ప్రవేశ పెట్టిన తెలంగాణ బడ్జెట్లో గల్ఫ్ కార్మికుల గురించి కేసీఆర్ సర్కారు ప్రత్యేకంగా ప్రస్తావించింది. బడ్జెట్లో 122వ అంశంగా గల్ఫ్ కార్మికుల సమస్యలను పొందుపరిచారు. ‘తెలంగాణ ప్రాంతం నుండి బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ కార్మికులను సానుభూతితో ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయడానికి ప్రత్యేక బృందం పర్యటించి వచ్చింది. ఆ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని బడ్జెట్లో పేర్కొన్నారు.
    ఇది కూడా చదవండి: హైదరాబాద్.. రోడ్డు పక్కనే ఓ అట్టపెట్టె చుట్టూ కుక్కలు చేరి అరుపులు.. ఏముందా అని ఓపెన్ చేసి చూసిన వాళ్లందరికీ..

    కాగా, ఈ విషయమై ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు లేని హామీలతో కాలం వెళ్లదీయవద్దని ఆయన కోరారు. గల్ఫ్ తో సహా 18 కి పైగా దేశాలలోని కార్మికులకు ఉపయోగపడే విధంగా రూ.500 కోట్ల బడ్జెట్ తో తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు (గల్ఫ్ బోర్డు) ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తిచేశారు. 2018 మార్చిలో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ. 100 కోట్లు కేటాయించినప్పటికీ నిధులు ఖర్చు చేయలేదని భీంరెడ్డి గుర్తుచేశారు.
    ఇది కూడా చదవండి: ఆ రోడ్డు కింద ప్రతీ అడుగుకో శవం.. తవ్వితే బయటపడే ఎముకల గుట్టలు.. వెన్నులో వణుకుపుట్టించే రియల్ స్టోరీ ఇది..!
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Andhra Pradesh, Dubai, Hyderabad, Kuwait, NRI News, Saudi Arabia, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు