Home /News /telangana /

TELANGANA GOVT LIKELY TO WITHDRAW JHONSONS BABY TALCUM POWDER FROM KCR KIT SK

KCR KIT: కేసీఆర్ కిట్‌ నుంచి ఆ వస్తువును తీసేస్తారా? క్యాన్సర్ కారకాలున్నాయని వివాదం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

KCR KIT: ప్రభుత్వాస్పత్రుల్లో బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి కేసీఆర్ కిట్‌ను ఉచితంగా ఇస్తున్నారు. తల్లీబిడ్డల సంరక్షణ కోసం పలు రకాల వస్తువులను ఈ కిట్ రూపంలో అందజేస్తున్నారు. ఐతే అందులో ఓ వస్తువును కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై తెలంగాణ ఆరోగ్యశాఖ తర్జనభర్జన పడుతోంది

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    తెలంగాణ ప్రభుత్వం  ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో (Telangana Govt Schemes) కేసీఆర్ కిట్ (KCR Kit) ఒకటి. ప్రభుత్వాస్పత్రుల్లో బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి కేసీఆర్ కిట్‌ను ఉచితంగా ఇస్తున్నారు. తల్లీబిడ్డల సంరక్షణ కోసం పలు రకాల వస్తువులను ఈ కిట్ రూపంలో అందజేస్తున్నారు. ఐతే అందులో ఓ వస్తువును కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై తెలంగాణ ఆరోగ్యశాఖ తర్జనభర్జన పడుతోంది. కేసీఆర్ కిట్‌లో జాన్సన్ సంస్థ (Jhonsons Products)  ఉత్పత్తులనే వాడుతున్నారు. ఐతే జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్‌ (Johnson's baby talcum powder)లో క్యాన్సర్ కారకాలున్నాయని ప్రపంచవ్యాప్తంగా వివాదముంది. ఈ క్రమంలోనే జాన్సన్ సంస్థ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది నుంచి జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్‌ని నిలిపివేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది.

    ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ కిట్‌లో జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్‌ని కొనసాగించడంపై తాజాగా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చర్చించారు. జాతీయ ఔషధ నియంత్రణ సంస్థ ఈ ఉత్పత్తిపై ఎలాంటి ఆదేశాలిస్తుందో వేచి చూద్దామని.. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుందామనే అభిప్రాయం వ్యక్తమైందని సమాచారం. కేసీఆర్ కిట్‌లో జాన్సన్ కంపెనీకి చెందిన నూనె, షాంపూ, పౌడర్, లోషన్ వంటి అనేక ఉత్పత్తులు ఉన్నాయి. ఐతే టాల్కమ్ పౌడర్ విషయంలో మాత్రమే ప్రపంచవ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.



    కాగా, బేబీ టాల్కమ్ పౌడర్ (Baby Talcum Powder) అమ్మకాలను 2023లో ప్రపంచవ్యాప్తంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంటే 2023 తర్వాత జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్ మార్కెట్లో కనిపించదు. అమెరికాలో వేలాది మంది ఈ పౌడర్‌పై కేసులు వేయడం వల్ల.. ఆ ఉత్పత్తిని విక్రయించడాన్ని నిలిపివేసినట్లు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఎన్నో దేశాల్లో బేబీ పౌడర్ విక్రయాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది నుంచి పూర్తిగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. టాల్కమ్ పౌడర్ స్థానంలో కార్న్ స్టార్చ్ పౌడర్‌ను తీసుకొస్తామని తెలిపింది.

    Johnson and Johnson news, Johnsons baby powder, Johnsons latest news, Johnsons powder ban, Johnsons latest news, జాన్సన్ బేబీ పౌడర్, జాన్సన్ పౌడర్‌పై నిషేధం,
    ప్రతీకాత్మక చిత్రం


    Telangana : అధికార పార్టీకి అభివృద్ధి పనుల స్ట్రోక్ .. రియాక్షన్‌ మాములుగా లేదు

    జాన్సన్ బేబీ పౌడర్ ఇప్పటి కాదు. 1894 నుంచీ విక్రయాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉంది. చిన్న పిల్లలు ఉండే ప్రతి కుటుంబంలోనూ దీన్ని వినియోగించారు. కానీ అమెరికా, కెనడాలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరగడం, కోర్టు జరిమానా విధించడంతో..ఆ ప్రభావం ఇతర దేశాల్లో కూడా పడింది. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్‌కు డిమాండ్ తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలోనే బేబీ టాల్కమ్ పౌడర్‌ని పూర్తిగా నిలిపివేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: CM KCR, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు