తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యవసాయ విస్తరణాధికారులు గ్రేడ్-2 (ఏఈవో) పోస్టుల నియామక ప్రక్రియకు అనుమతి ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 194 ఏఈవో గ్రేడ్-2 పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ ప్రకటించింది. పొరుగుసేవల విధానంలో పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏఈవో పోస్టుల భర్తీకి అనుమతించిన తెలంగాణ సీఎం కేసీఆర్కు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.