• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • TELANGANA GOVT HIKES SALARIES TO EMPLOYEES WORKING VARIOUS DEPARTMENTS VRY

Telanagna : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ రంగాల్లో పనిచేస్తున్న వారికి 30 శాతం వేతన పెంపు..!

Telanagna : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ రంగాల్లో పనిచేస్తున్న వారికి 30 శాతం వేతన పెంపు..!

Telanagna : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాట్రాక్ట్ లెక్చరర్లు, హోంగార్డులు, వీఆర్ఏ, వీఆర్ఓ, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, అంగన్‌వాడి హెల్పర్లు,సెర్ఫ్ సిబ్బంది, సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు అదనంగా ముప్పై శాతం వేతనాలు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది..అవి కూడా జూన్‌నెల నుండే అమల్లోకి రానున్నాయి.

  • Share this:
స్థానిక సంస్థల ప్రతినిధులకు,కాంట్రాక్ట్ ,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతోపాటు రోజువారిగా కూలీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వీరితో పాటు మొత్తం రాష్ట్రంలో గౌరవ వేతనం పొందుతున్న ప్రతి ఒక్కరికి ముప్పై శాతం వేతనాలను పెంచాలని నిర్ణయం తీసుకుని ఇందుకోసం ప్రతిపాదనలు తయారు చేసేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖకు ఆదేశాలు వెళ్లాయి.

కరోనా కష్టాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పని చేస్తున్న హోంగార్డులతో పాటు కాంట్రాక్ట్ టీచర్లకు,రెవెన్యు వ్యవస్థలో పనిచేసే వీఆర్ఎ, వీఆర్ఓలతోపాటు ఆశావర్కర్లు, గ్రామీణ పంచాయితీ వ్యవస్థలో పనిచేసే సెర్ఫ్ ఉద్యోగులకు ముప్పై శాతం వేతాలను అదనంగా పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది.

ఇందుకోసం ప్రతిపాదనలు పంపించాల్సిందిగా రాష్ట్ర ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి కె. రామకృష్ణారావు సర్క్యూలర్ జారీ చేశారు. ప్రతిపాదనలపై ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రస్తుతం చెల్లిస్తున్న ప్రతి ఒక్కరికి అదనంగా ముప్పై శాతం వేతనాలు చెల్లించనున్నారు.

ఇక మరోవైపు వీరితో పాటు ప్రభుత్వ విభాగాల్లో డెయిలీ వెజెస్ క్రింద పని చేసే వారికి కూడా శుభవార్త అందించింది.వీరికి కూడా అదనంగా ముప్పై శాతం పెంపుదలపై నిర్ణయం తీసుకున్నారు. కాగా ప్రస్తుతం రోజువారి పనిచేసేవారికి 300 రూపాయలు ఇస్తున్నారు. ప్రస్తుత పెంపుతో వారికి 390 రూపాయలు కానుంది.

స్థానిక ‌సంస్థల ప్రజాప్రతినిధులైన జెడ్పీటీసీలు, ఎంపీటీసిలు, సర్పంచ్ ల గౌరవ వేతనాన్ని 30% పెంచుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ‌ సందర్భంగా సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత, స్థానిక సంస్థల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు.

స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల సమస్యలు, నిధులు, విధులు వంటి‌ అంశాలపై ‌, ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో 12 మంది స్థానిక ‌సంస్థల‌ ఎమ్మెల్సీలు పలు సమావేశాలు జరిపి, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.

రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ప్రస్తుత వేతనాల ప్రకారం కాట్రాక్ట్ లెక్చరర్లు, 48,230, హోంగార్డులకు 26000, వీఆర్ఏ 13650, వీఏఓ 6500 , ఆశావర్కర్లు 7800, అంగన్‌వాడీ టీచర్లు 13650, అంగన్‌వాడి హెల్పర్లు 7800,సెర్ఫ్ సిబ్బంది 15600, సర్పంచ్‌లు 6500,జడ్పీటీసీలు 13000, ఎంపీటీసీలకు 6500 రూపాయలు పెరగనున్నాయి
Published by:yveerash yveerash
First published: