హోమ్ /వార్తలు /తెలంగాణ /

water dispute : గెజిట్‌పై తెలంగాణ ఆగ్రహం.... సుప్రింకు వెళ్లేందుకు మంతనాలు.. పార్లమెంట్‌లో ఆందోళన..?

water dispute : గెజిట్‌పై తెలంగాణ ఆగ్రహం.... సుప్రింకు వెళ్లేందుకు మంతనాలు.. పార్లమెంట్‌లో ఆందోళన..?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

water dispute : నదీ జలాలపై కేంద్రం విడుదల చేసిన గెజిట్‌పై తెలంగాణ ప్రభుత్వం సుప్రిం కోర్టుకు వెళ్లేందుకు సిద్దమవుతుండడంతో పాటు పార్లమెంట్‌ను సైతం స్థంబింప చేసేందుకు నిర్ణయం తీసుకోనుంది. ఇందుకు సంబంధించి టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చిస్తున్నారు..

ఇంకా చదవండి ...

నదీ జలాలపై గెజిట్ విడుదల చేయడంతో పై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇందుకు సంబంధించి న్యాయపరమైన పోరాటం చేసేందుకు న్యాయనిపులతో సంప్రదింపులు జరుపుతోంది. ఇందుకు సంబంధించి ప్రజాస్వామ్యయుతంగా కూడా పోరాడేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఈ నెల 19 నుండి పార్లమెంట్ సమావేశంలో గెజిట్ నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌ను లేవనెత్తనున్నారు. పార్లమెంట్‌లో చేపట్టాల్సిన కార్యచరణపై సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశనిర్ధేశం చేయనున్నారు.

కాగా తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నదీజలాల విషయంలో వాటిని బోర్డు పరిధిలోకి తీసుకువచ్చి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే అయితే నీటి కేటాయింపులు జరగకుండా...నోటిఫికేషన్ విడుదల చేయడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. విభజన చట్టంలో భాగంగా ఒక సంవత్సరం మేరకు మాత్రం నీటి కేటాయింపులకు రాష్ట్రం ఒప్పుకుందని, కాని అదే ఒప్పందాలను కంటిన్యూ చేయడం సమంజంగా ఉండదని తెలంగాణ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అపెక్స్ కమిటీలో కూడా ఈ అంశాలను లేవనెత్తామని, కాని వాటిని పరిగణలోకి తీసుకోని కేంద్రం ఏకపక్షంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.మరోవైపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రాకముందే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం పై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తోంది. కేంద్రం నిర్ణయం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందనే ఆందోళనను వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఇప్పటికే ప్రాజేక్టుల విషయంలో అవసరమైతే.. దేవుడితోనే కొట్లాడతామని మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటించడంతో కేంద్ర వైఖరిపై పోరాటానికి సిద్దమయినట్టు అర్థమవుతోంది.

కాగా మరోవైపు ఇరు రాష్ట్రాలు సైతం జల వివాదాలపై కేంద్రం జోక్యం తీసుకోవాలని కోరాయని, గత కొద్ది రోజులుగా సమస్య పరిష్కారం కాకపోవడంతోనే కేంద్రం జోక్యం చేసుకుని పెద్దన్న పాత్ర పోషించేందుకు ముందుకు వచ్చిందని రాష్ట్ర బీజేపీ నాయకత్వం చెబుతోంది.అయితే టీఆర్ఎస్ మాత్రం తన ఆందోళనను కంటిన్యూ చేసేందుకే సిద్దమయినట్టు కనిపిస్తోంది. మరోవైపు కేంద్ర జలశక్తి శాఖ అధికారులు మీడియా ముందుకు రాబోతున్నారు. గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయాల్సి వచ్చిందో వివరించనున్నారు.

First published:

Tags: Krishna River Management Board, Telangana, Water dispute

ఉత్తమ కథలు