Telangana Govt: మొదటి డోస్ టీకా ఆ తేదీ తర్వాతనే.. అప్పటి వరకు సెకండ్ డోస్ టీకా మాత్రమే పంపిణీ..

ప్రతీకాత్మక చిత్రం

Telangana: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాక్సిన్ మాత్రం మొదట తీసుకున్న వారికే ఇస్తున్నారు. మే 31 వరకు సెకండ్ డోస్ ఇస్తామని తర్వాత మొదటి డోస్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు.

  • Share this:
    కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని.. లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు అన్నారు. లాక్‌డౌన్ మినహాయింపు సమయంలో ప్రజలందరూ అత్యంత జాగ్రత్తతో ఉండాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు. లాక్‌డౌన్ మినహాయింపు సమయంలో ప్రజలందరూ అత్యంత జాగ్రత్తతో ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఇంకా 15 లక్షల మందికి మే 31 లోపు వారికి రెండో డోస్ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. సెకండ్‌ డోస్‌ టీకాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ అవసరం లేదని.. నేరుగా సెంటర్‌కు వెళ్లి సెకండ్‌ డోస్‌ వేయించుకోవచ్చని సూచించారు. గురువారం సాయంత్రం ఆయన డీఎంఈతో కలిసి హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. కోవిషీల్డ్ రెండో డోసును 6 నుంచి 8 వారాల మధ్యలో తీసుకోవాలని, కోవ్యాగ్జిన్ 4 నుంచి 6 వారాల మధ్యలో తీసుకోవాలని సూచించారు.

    మిగతా వారికి దశల వారీగా టీకాను అందిస్తామని శ్రీనివాసరావు తెలిపారు. గతేడాది సెప్టెంబర్ నాటికి 236 ఆస్పత్రులు కోవిడ్ సేవలకు అందుబాటులో ఉంటే, వాటిని 1200 కు పైగా పెంచుకున్నామని పేర్కొన్నారు. ఆక్సిజన్, రెమిడేసివివర్ గురించి స్టేట్ టాస్క్‌ఫోర్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంటుందని తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.

    ప్రజలందరూ సంయమనం పాటించాలన్నారు. 18 సంవత్సరాలు పైడిన వారిక ఎప్పటి నుంచి టీకా వేస్తామనే దానిపై త్వరలో తేదీ ప్రకటిస్తామని స్ఫష్టం చేశారు. మే 31 తర్వాతనే మొదటి డోస్ టీకా ఉంటుందన్నారు. అప్పటి వరకు ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు.
    Published by:Veera Babu
    First published: