• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • TELANGANA GOVT GIVES CLARITY ON BIRD FLU AND POULTRY INDUSTRY HERE IS DETAILS SK

Bird Flu: బర్డ్ ఫ్లూ భయమా? చికెన్ తినొద్దా? తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

Bird Flu: బర్డ్ ఫ్లూ భయమా? చికెన్ తినొద్దా? తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

Bird Flu: మన రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు. చికెన్, కోడిగుడ్డు తింటే బర్డ్‌ఫ్లూ రాదని.. వైద్య నిపుణులు కూడా ఇదే చెబుతున్నారని మంత్రి తలసాని తెలిపారు.

  • Share this:
    దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ టెన్షన్ నెలకొంది. పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నిర్ధారణ కావడంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. పెద్ద మొత్తంలో పక్షులు చనిపోతుండడంతో అందరిలోనూ ఆందోళన మొదలయింది. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో చికెన్, గుడ్ల విక్రయాలను నిషేధించడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకూ భయం పట్టుకుంది. చికెన్ తినాలా? వద్దా? అని డైలమాలో పడ్డారు. ఈ నేపథ్యంలో బర్డ్ ఫ్లూ వ్యాధిపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. బర్డ్‌ఫ్లూ వైరస్‌కు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. ఈ వ్యాధితో ఇప్పటి వరకు మనుషులకు ఎలాంటి నష్టం జరగలేదని తెలంగాణ ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

    ఇతర రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాపిస్తున్న నేపథ్యంలో .. రాష్ట్రంలో తాజా పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై పలు శాఖల అధికారులు, పౌల్ట్రీరంగ నిపుణులతో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశమయ్యారు. ముందు జాగ్రత్తగా రాష్ట్రవ్యాప్తంగా హెల్త్‌ ర్యాపిడ్‌ యాక్షన్‌ టీమ్‌లను ఏర్పాటు చేశామని మంత్రులు ఈటల, తలసాని చెప్పారు. చికెన్, గుడ్లు తింటే బర్డ్ ఫ్లూ రాదని.. పుకార్లతో పౌల్ట్రీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని తెలిపారు.

    బర్డ్ ఫ్లూపై తెలంగాణ ప్రభుత్వం ముందే అప్రమత్తమయిందని.. సరిహద్దు జిల్లాల యంత్రాంగాన్ని అలర్ట్ చేశామని మంత్రి తలసాని చెప్పారు. అవసరమైన మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. మన రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు. చికెన్, కోడిగుడ్డు తింటే బర్డ్‌ఫ్లూ రాదని.. వైద్య నిపుణులు కూడా ఇదే చెబుతున్నారని మంత్రి తలసాని తెలిపారు. కరోనా సంక్షోభం నుంచి పౌల్ట్రీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని... ఇలాంటి సమయంలో మళ్లీ బర్డ్ ఫ్లూపై భయాందోళనలు అవసరం లేదని ప్రజలకు సూచించారు. పుకార్లు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. పౌల్ట్రీ రైతులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. వారికి ప్రభుత్వం సలహాలు సూచనలు ఇస్తోందని మంత్రి తలసాని చెప్పారు. వలస పక్షుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
    Published by:Shiva Kumar Addula
    First published: