NGT :ఎన్జీటికి మరోసారి తెలంగాణ ప్రభుత్వం.. ధిక్కారణ పిటిషన్ ఫైల్...!

NGT :ఎన్జీటికి మరోసారి తెలంగాణ ప్రభుత్వం.. ధిక్కారణ పిటిషన్ ఫైల్...!

NGT : రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ధిక్కారణ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఫైల్ చేసింది. ఎన్జీటి సభ్యులే స్వయంగా ప్రాజెక్టు నిర్మాణ పనులను పరీశీలించాలని కోరింది. ఈమేరకు ఎన్జీటి చెన్నై కోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది.

 • Share this:
  రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మరింత వివాదం ముదురుతోంది..ఇరు రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు పట్టువిడుపులు లేకుండా వ్యవహరిస్తుండడంతో నీటి సమస్య మరింత జఠిలంగా మారనుంది. ఈ నేపథ్యంలోనే ఎన్జీటి ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వం ధిక్కారణ పిటిషన్ ధాఖలు చేసింది. కాగా ఇదివరకే రాయలసీమ ఎత్తిపోతలను వెంటనే నిలిపివేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ పనులు కొనసాగుతున్నట్టయితే...చీఫ్ సెక్రటరీని జైలుకు పంపించాల్సివస్తుందని హెచ్చరించింది. దీంతో రాయలసీమ ఎత్తిపోతలపై రెండు రాష్ట్రాల మధ్య మరింత ఆందోళనకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అయినా ఏపి ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగిస్తుండడంపై తెలంగాణ ప్రభుత్వం కోర్టు ధిక్కారణ పిటిషన్‌ను ధాఖలు చేసింది.

  రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మరింత వివాదం ముదురుతోంది..ఇరు రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు పట్టువిడుపులు లేకుండా వ్యవహరిస్తుండడంతో నీటి సమస్య మరింత జఠిలంగా మారనుంది. ఈ నేపథ్యంలోనే ఎన్జీటి ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వం ధిక్కారణ పిటిషన్ ధాఖలు చేసింది. కాగా ఇదివరకే రాయలసీమ ఎత్తిపోతలను వెంటనే నిలిపివేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ పనులు కొనసాగుతున్నట్టయితే...చీఫ్ సెక్రటరీని జైలుకు పంపించాల్సివస్తుందని హెచ్చరించింది. దీంతో రాయలసీమ ఎత్తిపోతలపై రెండు రాష్ట్రాల మధ్య మరింత ఆందోళనకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అయినా ఏపి ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగిస్తుండడంపై తెలంగాణ ప్రభుత్వం కోర్టు ధిక్కారణ పిటిషన్‌ను ధాఖాలు చేసింది.
  ఇందులో భాగంగానే ప్రాజెక్టు అభివృద్ది పనులపై పలు వివరాలు అందించింది.గతం సంవత్సరం కూడా ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవని అయినా ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని లేఖలో పేర్కొంది. కేంద్ర పర్యావరణ శాఖతో పాటు జలశక్తి శాఖ,కేఆర్ఎంబీ బోర్డు నుండి కూడా అనుమతులు లేవని తెలిపింది.

  దీంతోపాటు ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను సైతం జోడిచింది. అయితే పనులు జరుగుతున్నాయో లేవో తెలుసుకునేందుకు వివిధ విభాగాలకు చెందిన అధికారులతో పాటు కేఆర్ఎంబీ అధికారులను సందర్శించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఇందుకు సంబంధించి అధికారులను అనుమతించేందుకు ఏపి అంగీకరించలేదు.  ఈ నేపథ్యంలోనే ట్రిబ్యునల్ సభ్యులే నేరుగా సందర్శించాలని తన పిటిషన్‌లో పేర్కోంది.
  Published by:yveerash yveerash
  First published: